RAPO 22: ప్రేమతో ఈ కొత్త సంవత్సరం.. రామ్ పోతినేని కొత్త సినిమా అప్డేట్

RAPO 22: ప్రేమతో ఈ కొత్త సంవత్సరం.. రామ్ పోతినేని కొత్త సినిమా అప్డేట్

హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి (Mahesh Babu) దర్శకత్వంలో 'రాపో 22' (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నాడు. మైత్రి మేకర్స్ రూపొందించనున్న ఈ మూవీ నుంచి న్యూ ఇయర్ అప్డేట్ వచ్చింది.

ప్రేమతో ఈ కొత్త సంవత్సరం అంటూ క్రేజీ పోస్టర్ రిలీజ్ చేసింది. "జనవరి 1న ఉదయం 10: 35 గంటలకు ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ రామ్, భాగ్యశ్రీల అప్డేట్ రానుంది" అంటూ మేకర్స్ తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో వాన చినుకుల నడుమ తడుస్తూ ముగ్దులవుతున్న ఈ జోడీ ఆకట్టుకుంటోంది.

ఇకపోతే  'రాపో 22' విషయానికి వస్తే.. ఇందులో రామ్ సరసన  క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ గురించి హీరో రామ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు.

'సమ్‌‌‌‌థింగ్ ఫ్రెష్, న్యూ, అన్‌‌‌‌టోల్డ్ స్టోరీని ఎక్స్‌‌‌‌పీరియెన్స్ చేయడానికి రెడీగా ఉండండి.. సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ మహేష్‌‌‌‌తో వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నా’ అని ట్యాగ్ ఇచ్చాడు. షేర్ చేసిన ఫొటోలో సైకిల్ నడుపుతూ వెనుక నుంచి కనిపిస్తున్న రామ్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ALSO READ | OTT Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ థ్రిలర్ మూవీ.. రూ.30 కోట్ల బ‌డ్జెట్.. వంద కోట్ల క‌లెక్ష‌న్స్

అలాగే ఈ చిత్రంతో టాలీవుడ్‌‌కు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ పరిచయం అవుతున్నారు. తమిళనాట ఇప్పటికే పలు చిత్రాలకు వర్క్ చేసిన వివేక్,మెర్విన్ సంగీత ద్వయం ఈ చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్నారు. వీళ్లిద్దరి అసలు పేర్లు వివేక్ శివ, మెర్విన్ సాల్మన్. ‘వడా కర్రీ’ అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించి ధనుష్ ‘పటాస్’,  ప్రభుదేవా ‘గులేబకావళి’,  కార్తి ‘సుల్తాన్’ చిత్రాలతో మ్యూజికల్ హిట్స్ అందుకున్నారు.