2025 నూతన సంవత్సరం కోసం.. విషెష్ కోట్స్, ఫన్నీ విషెష్

2025 నూతన సంవత్సరం కోసం.. విషెష్ కోట్స్, ఫన్నీ విషెష్

కొత్త సంవత్సరం వచ్చేస్తుందోచ్.. మరో నాలుగు రోజుల్లో పాత సంవత్సరం 2024 కు వెళ్లిపోతుంది.. 2024కి గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సరం 2025 కు స్వాగతం పలికేందుకు అందరూ ఎదురు చూస్తున్నారు.. న్యూఇయర్ కు  గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు.. కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా.. మనకు ఇష్టమైన వారితో ఆనందం, ప్రేమ, పాజిటివ్ జోష్ ను పెంచుకునేందుకు ఓ మంచి తరుణం.. వాట్సాప్.. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి ప్లాట్ ఫాంల  ద్వారా వారికి  మనం మేసేజ్ లు పంపించొచ్చు. వారితో మన ఎంజాయ్ మెంట్ ను షేర్ చేసుకోవచ్చు. న్యూఇయర్ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో రకరకాల హ్యాపీ న్యూ ఇయర్ 2025 మేసేజ్ లు, విషెష్ తెలిపేందుకు  కోట్స్, ఫన్నీ విషెష్ మీకోసం.

  • 2025 మీకు ఆనందం, శాంతి, సంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటాను. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు 
  • ఈ కొత్త సంవత్సరం మీకు అన్ని రకాల విజయాలు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను. హ్యాపీ న్యూఇయర్2025
  • మీ కలలు నిజమయ్యే సంవత్సరం కావాలని కోరుకుంటాను.2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  • ‘‘కొత్త సంవత్సరం, కొత్త కలలు! 2025లో  మీకు మంచి జరగాలని, ఈ ఏడాది అన్ని విజయాలే కలగాలి..  నూతన సంవత్సర శుభాకాంక్షలు ”
  • 2024 చింతలను విడిచిపెట్టి, 2025 సంవత్సరం మంచిమంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు"
  • ‘‘2025 సంవత్సరం మీకు శాంతి ,ఆనందం, మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని తీసుకురావాలి. మీకు , మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు’’

ఫన్నీ విషెష్:

  • 2025లో మీరు అన్ని రకాల పనులు చేయాలని నిర్ణయించుకోండి... కానీ ముందుగా అలారం గడియారం ఆపడం మర్చిపోవద్దు!.. హ్యాపీ న్యూఇయర్ 2025
  • ఈ సంవత్సరం మీరు ఒకేసారి రెండు పనులు చేయడం నేర్చుకోండి...ఉదాహరణకు, నిద్రిస్తూ ఉండటం, డబ్బు సంపాదించడం. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు 
  • 2025లో మీరు ఎప్పుడూ ఆకలితో ఉండకూడదు...అందుకే ఫ్రిజ్ దగ్గర ఎక్కువ సేపు నిలబడండి.2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు 

సోషల్ మీడియా శుభాకాంక్షలు:

  • నూతన సంవత్సరంలో మీరు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండాలని కోరుకుంటాను... అయితే కొంచెం ఆరోగ్యంగా ఉండండి. హ్యాపీ న్యూఇయర్2025
  • 2025లో మీరు ఎక్కువ లైక్స్ ,కామెంట్స్ పొందాలని కోరుకుంటాను... కానీ నిజ జీవితంలో మంచి స్నేహితులను కూడా పొందండి. 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ALSO READ | Telangana Success: సిద్దిపేట ముక్క పచ్చళ్లు.. నోరూరించే ఆ టేస్టే వేరు.. ఒక్కసారైనా తినాల్సిందే..!