Anora OTT: రికార్డులు సృష్టించిన వేశ్య కథ.. ఐదు ఆస్కార్ అవార్డులు.. ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో చూడాలంటే?

Anora OTT: రికార్డులు సృష్టించిన వేశ్య కథ.. ఐదు ఆస్కార్ అవార్డులు.. ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో చూడాలంటే?

ఆస్కార్ 2025 అవార్డుల్లో ‘అనోరా’ (Anora) మూవీ సత్తా చాటింది. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి అవార్డుల పంట పండింది. ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులును దక్కించుకుని టాక్ అఫ్ ది ఆస్కార్గా నిలిచింది. ఈ మూవీకి సీన్ బేకర్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‍ప్లే, ఎడిటింగ్, దర్శకత్వ విభాగాల్లో పనిచేసి సత్తా చాటాడు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే మరియు ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాడు.

ఉత్తమ చిత్రం, ఎడిటింగ్‌, స్క్రీన్‌ ప్లే, ఉత్తమ దర్శకుడు తో పాటుగా ఈ సినిమాలో నటించిన మైకీ మ్యూడిసన్‍కు ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డ్ దక్కింది. దాంతో ఆనోరా సినిమాకు నాలుగు, నటించిన నటి మైకీ మ్యూడిసన్‍కు మరో అవార్డు. ఇలా మొత్తం ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. అయితే, ఇపుడు ఈ మూవీ ఎక్కడ చూడాలి. ఎలా చూడాలనేది సోషల్ మీడియాలో ఆడియన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. మరి ఆ ఓటీటీ వివరాలేంటో చూసేద్దాం.

అనోరా ఓటీటీ:

అనోరా మూవీ 3 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది. అయితే,  ప్రస్తుతం ఈ మూవీ రెంటల్ విధానంలో మాత్రమే చూసేలా సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాని చూడాలంటే రెంట్ చెల్లించి చూడాల్సిందే. అలాగే, మరో ఇంట్రెస్టింగ్ టాక్ ప్రకారం.. ఇదే నెలలో (మార్చి) లో ఈ జియో హాట్‍స్టార్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. 

అనోరా కథేంటంటే:

రెడ్‌ రాకెట్‌’, ‘ది ఫ్లోరిడా ప్రాజెక్ట్‌’ వంటి చిత్రాలను తీసిన సీన్‌ బేకర్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రమే ‘అనోరా’. అనోరా మిఖీవా ( మైకీ మాడిసన్ ) అనే 23 ఏళ్ల వేశ్య (వ్యభిచారి) చుట్టూ జరిగే కథ ఇది. ఆమెకు రష్యన్ పరిపాలకుడు కుమారుడు వన్య జాకరోవ్‍ (ఇడిల్‍స్టెయిన్) పరిచయం ఏర్పడుతుంది. ఒక వారం పాటు అతనితో ఉండటానికి ఆమెకు $15,000 డాలర్లుతో డీల్ సెట్ చేసుకుంటుంది.

Also Raed :  హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి తప్పుడు ప్రచారం

ఇక కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత మిఖీవా, జాకరోవ్ పెళ్లి చేసుకుంటారు. అయితే, వీరిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని జాకరోవ్ పేరెంట్స్ డిసైడ్ అవుతారు. అందుకు తమ కుమారుడిని వదిలేస్తే 10 వేల డాలర్లు ఇస్తామని ఆశ చూపిస్తారు. మరి, అని వారిచ్చిన ఆఫర్‌ను అనోరా స్వీకరించిందా? లేదా? ఈ క్రమంలో అనోరా ఎలాంటి మలుపులు పేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మిఖీవా తనదైన ఎత్తులతో ఏం చేసింది? అనేది కథ.