ఆస్కార్​ అవార్డులు - 2025: అనోరా సినిమాకు ఐదు అవార్డులు

ఆస్కార్​ అవార్డులు - 2025:  అనోరా సినిమాకు ఐదు అవార్డులు

లాస్​ఏంజెల్స్​ డాల్బీ థియేటర్​లో జరిగిన 97వ అకాడమీ అవార్డు(ఆస్కార్ అవార్డులు–2025)ల ప్రదానోత్సవంలో అనోరా సినిమాకు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్​ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నది. ది బ్రూటలిస్ట్​లో నటనకుగాను ఉత్తమ నటుడిగా అడ్రియన్​ బ్రాడీ, అనోరాలో నటనకుగాను మైకీ మ్యాడిసన్​ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఏ రియల్​ పెయిన్​ చిత్రానికి కీరన్​ కైల్​కల్కిన్​ఉత్తమ సహాయ నటుడిగా, ఎమిలియా పెరెజ్​లో నటనకుగాను జోయా సాల్డానా ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్నారు. 

అవార్డుల జాబితా

  • ఉత్తమ చిత్రం – అనోరా
  • ఉత్తమ నటుడు – అడ్రియన్​ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
  • ఉత్తమ నటి – మైకీ మ్యాడిసన్​(అనోరా)
  • ఉత్తమ దర్శకత్వం – అనోరా (సీన్​ బేకర్​)
  • ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కైల్​ కల్కిన్ 
  • ఉత్తమ సహాయ నటి – జోయా సాల్డానా 
  • ఉత్తమ స్క్రీన్​ ప్లే – కాన్​క్లేవ్​(పీటర్​ స్ట్రాగరన్)
  • ఉత్తమ అడాప్టెడ్​ స్క్రీన్​ప్లే– కాన్​క్లేవ్​(పీటర్​ స్ట్రాగన్)
  • ఉత్తమ కాస్ట్యూమ్​ డిజైన్ – వికెడ్​ (పాల్​ తేజ్​వెల్​)
  • ఉత్తమ మేకప్, హెయిర్​ స్టైల్​– ది సబ్​ స్టాన్స్
  • ఉత్తమ ఎడిటింగ్​– అనోరా (సీన్ బేకర్)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ – ది బ్రూటలిస్ట్​(లాల్​ క్రాలే)
  • ఉత్తమ సౌండ్​ – డ్యూన్​ పార్ట్​–2
  • ఉత్తమ విజువల్​ ఎఫెక్ట్స్​ – డ్యూన్​ పార్ట్​–2
  • ఉత్తమ ఒరిజినల్​ సాంగ్​– ఎల్​మాల్​ 
  • ఇంటర్నేషనల్​ ఫీచర్​ ఫిల్మ్​ – ఐయామ్​ స్టిల్​ హియర్​ఉత్తమ ఒరిజినల్​ స్కోర్​ – ది బ్రూటలిస్ట్​ 
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్​– వికెట్​
  • ఉత్తమ లైవ్​ యాక్షన్​ షార్ట్​ఫిల్మ్​– ఐయామ్​నాట్​ ఏ రోబో
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్​ ఫిల్మ్​– ది ఓన్లీ గర్ల్​ ఇన్​ ది ఆర్కెస్ట్రా
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్​ ఫిల్మ్​– నో అదర్​ ల్యాండ్