
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025 పదో ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 11న ప్రారంభం కానున్న ఈ టోర్నీ మే 18 న ఫైనల్ తో ముగుస్తుంది. తొలిసారి పాకిస్థాన్ సూపర్ లీగ్ ఐపీఎల్ తో పోటీ పడనుంది. ఐపీఎల్ మార్చి 22 నుంచి మే 25 వరకు జరుగుతుంది. ఐపీఎల్ తర్వాత పాకిస్థాన్ సూపర్ లీగ్ ను ఎక్కువగా చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఈ సారి రెండు లీగ్స్ క్లాష్ అవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్ కు డబుల్ కిక్ లభించనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఇస్లామాబాద్ యునైటెడ్ బరిలోకి దిగుతుంది.
టోర్నీ తొలి మ్యాచ్ లో లాహోర్ ఖలందర్స్ తో ఇస్లామాబాద్ యునైటెడ్ తలపడనుంది. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. రావల్పిండి క్వాలిఫైయర్ 1తో సహా టోర్నమెంట్‌లోని 11 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. లాహోర్‌లోని ఐకానిక్ గడాఫీ స్టేడియంలో ఫైనల్, ఎలిమినేటర్స్ తో సహా మొత్తం 13 మ్యాచ్ లు జరుగుతాయి. కరాచీలోని నేషనల్ స్టేడియం, ముల్తాన్ చెరో ఐదు మ్యాచ్ లకు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 6 జట్లు (ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్,పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్,కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్) టైటిల్ కోసం తలపడనున్నాయి.
Also Read:-షర్ట్ లక్ష, ప్యాంట్ లక్షన్నర, వాచ్ 10 లక్షలు.. ఈ SRH క్రికెటర్ చాలా రిచ్..
పాకిస్థాన్ ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిన పాక్, అనంతరం దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. చాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్య పాకిస్తాన్ జట్టు విజయమన్నదే లేకుండా ముగించింది. గురువారం (ఫిబ్రవరి 27) దాయాది జట్టు బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యింది. దీంతో ఒక పాయింట్ తో గ్రూప్ దశను ముగించింది.
PSL 10 షెడ్యూల్:
11 ఏప్రిల్ - ఇస్లామాబాద్ యునైటెడ్ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
12 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం; కరాచీ కింగ్స్ v ముల్తాన్ సుల్తాన్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 13 – క్వెట్టా గ్లాడియేటర్స్ vs లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 14 - ఇస్లామాబాద్ యునైటెడ్ v పెషావర్ జల్మీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం
15 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v లాహోర్ క్వాలండర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
ఏప్రిల్ 16 – ఇస్లామాబాద్ యునైటెడ్ vs ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
18 ఏప్రిల్ – కరాచీ కింగ్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
19 ఏప్రిల్ - పెషావర్ జల్మీ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 20 – కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
21 ఏప్రిల్ - కరాచీ కింగ్స్ v పెషావర్ జల్మీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
22 ఏప్రిల్ – ముల్తాన్ సుల్తాన్స్ vs లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
23 ఏప్రిల్ – ముల్తాన్ సుల్తాన్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
ఏప్రిల్ 24 - లాహోర్ ఖలాండర్స్ v పెషావర్ జల్మీ, గడాఫీ స్టేడియం, లాహోర్
25 ఏప్రిల్ – క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
26 ఏప్రిల్ – లాహోర్ ఖలందర్స్ v ముల్తాన్ సుల్తాన్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
27 ఏప్రిల్ - క్వెట్టా గ్లాడియేటర్స్ v పెషావర్ జల్మీ, గడాఫీ స్టేడియం, లాహోర్
29 ఏప్రిల్ – క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 30 – లాహోర్ ఖలందర్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 1 – ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం; లాహోర్ ఖలందర్స్ vs క్వెట్టా గ్లాడియేటర్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 2 - పెషావర్ జల్మీ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్
మే 3 – క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ ఇస్లామాబాద్ యునైటెడ్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 4 - లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 5 - ముల్తాన్ సుల్తాన్స్ v పెషావర్ జల్మీ, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
మే 7 – ఇస్లామాబాద్ యునైటెడ్ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 8 - పెషావర్ జల్మీ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 9 - పెషావర్ జల్మీ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 10 – ముల్తాన్ సుల్తాన్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం; ఇస్లామాబాద్ యునైటెడ్ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 13 – క్వాలిఫైయర్ 1, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 14 – ఎలిమినేటర్ 1, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 16 – ఎలిమినేటర్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 18 – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్