2025 ప్రారంభం..కొత్త జనరేషన్ బీటా యుగానికి కూడా నాంది పలుకుతుంది.ఈ యుగంలో రాబోయే 15 యేళ్లలో జన్మించే కొత్త జనరేషన్ పిల్లల గురించి చెబుతోంది. 2025 నుంచి 2039 మధ్య జన్మించిన పిల్లలను వివరించడానికి ఉపయోగపడుతుంది. ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న టెక్నాలజీతో అనుబంధం,లోతైన సామాజిక మార్పులు గురించి వివరిస్తుంది.
జనరేషన్రిసెర్చర్స్ (తరాల పరిశోధకులు) ఇప్పటివరకు మూడు రకాల జనరేషన్లు విభజించారు. అంటే 1981 నుంచి ఇప్పటివరకు పుట్టినవారిని మిలీనియల్స్(1981–1996), Gen Z(1996-2010), Gen Alpha(2010-2024) అని మూడు జనరేషన్లలో చూపించారు. ఇక 2025నుంచి 2039 వరకు పుట్టే పిల్లలను నాలుగో జనరేషన్బీటా యుగానికి చెందిన వారికిగా వర్ణిస్తున్నారు.
జనరేషన్ పరిశోధకుడు, రచయిత జాసన్ డోర్సే జనరేషన్ బీటా గురించి చెబుతూ..ఈతరం పిల్లలు, పాత జరేషన్ పిల్లలకు మధ్య తేడాను వివరించారు. మిలీనియల్స్, జెన్ జెర్స్, జనరల్ఆల్ఫ వారికంటే భిన్నంగా వారి జీవితాలను ప్రారంభిస్తారని చెబుతున్నారు.
జనరేషన్ బీటా ..కొత్త తరం గురించి కొన్ని విషయాలు..
జనరేషన్ బీటా ..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ డివైజ్ లు లేకుండా వీరి జీవితం లేదు. AI, స్మార్ట్ ఫోన్లు లేకుండా రోజులో ఒక్క క్షణం కూడా గడవదని అంటున్నారు.
సోషల్ మీడియా అనేది ఇప్పుడున్న జనరేషన్లకు సూచిక అయితే..జనరేషన్ బీటా లో ఇంకా బాగా డెవలప్ చేయబడుతుందంటున్నారు..ఒకరకంగా చెప్పాలంటే.. ఈజనరేషన్ లో పుట్టినవారు సోషల్ మీడియాలో పూర్తిగా మునిగి తేలుతారని చెబుతున్నారు.
అంతేకాదు..అనేక సమాజిక సవాళ్లతో పోరాడే ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని చెబుతున్నారు.పర్యావరణ సవాళ్లు సామాజిక విలువపై ప్రభావం చూపుతా యని అంటున్నారు.
మిలీనియల్స్, జెన్ ఆల్ఫా, జెన్ జెర్స్ వారి పిల్లలు ఈ జనరేషన్ లో ఉంటారు.. వీరంతా 22వ శతాబ్దంలో జీవిస్తారని ప్రముఖ జనరేషన్రీసెర్చర్ డోర్సే చెబుతున్నారు.