2025తో జనరేషన్ బీటా మొదలు

2025, జనవరి 1 నుంచి 2039, డిసెంబర్ 31 వరకు జన్మించిన వారందరూ జనరేషన్​ బీటా జనరేషన్​లోకి వస్తారు. అంటే దాదాపు 15 సంవత్సరాలపాటు పుట్టే పిల్లలందరినీ జనరేషన్ బీటాగా పిలుస్తారు. భారతదేశంలో మొదటి బీటా బేబి మిజోరాంలోని డర్ట్​ లాండ్​ నగరంలోని సినోడ్​ హాస్పిటల్​లో పుట్టాడు. ఫ్రాంకీ రెమ్రుత్డికా జాడెంగ్​ అని పేరు పెట్టారు. 

బీటా బేబీస్​ పుట్టేది, పెరిగేది అంతా అడ్వాన్సడ్​ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​మధశ్యలోనే వీరి జీవనశైలి, ఎడ్యుకేషన్, ఎంటర్​టైన్ మెంట్​అన్నీ ఏఐతో ముడిపడి ఉంటాయి. 
    
ఒక్కొక్కరి అభిరుచులకు తగ్గట్టు ఏఐ టూల్స్​ ఉండటంతో ప్రతి ఒక్కరికీ యూనిక్​ ఎక్స్​పీరియన్సెస్​ దొరుకుతాయి. దాంతో ఈ డిజిటల్​ వరల్డ్​కి సులువుగా కనెక్ట్​ అయిపోతారు. 
    
టెక్నాలజీపైనే పూర్తిగా ఆధారపడటం వల్ల మెంటల్​ హెల్త్, వ్యక్తిగత సమాచార భద్రత ముప్పు వాటిల్లుతుంది. వాతావరణ మార్పులు, మెట్రోపాలిటిన్​ నగరాల జీవనశైలి, అధిక జనాభాతో ఉన్న భవిష్యత్తుని జనరేషన్​ బీటా ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్యావరణాన్ని కాపాడుకోవడం తప్పనిసరి అయిపోతుంది.

జనరేషన్ అంటే

ఒకే సమయంలో ఒకేలాంటి కల్చర్, సోషల్, హిస్టారికల్​ ఎక్స్ పీరియన్సెస్​​ షేర్​ చేసుకున్న వారిని ఒక జనరేషన్​ అంటారు. ఇలా జనరేషన్స్​కు పేర్లు పెట్టడం 1901లో ప్రారంభమైంది. జనరేషన్ బీటాకు ముందు గ్రేటెస్ట్​ జనరేషన్​(1901–1927), సైలెంట్​ జనరేషన్​ (1928–1945), బేబీ బూమర్స్​ (1946–64), జనరేషన్ ఎక్స్​ (1965–80), జనరేషన్ వై లేదా మిలీనియల్స్​(1981–1996), జనరేషన్ జెడ్​ (1997–2009), జనరేషన్ ఆల్ఫా (2010–2024) లు ఉన్నాయి.