Tollywood Movies: 2025@ పొంగల్ పోస్టర్స్తో.. తెలుగు సినిమాల కొత్త అప్డేట్స్ ఇవే

తెలుగు సినిమాకు పెద్ద పండుగగా భావించే సంక్రాంతికి ఈసారి మూడు సినిమాలు విడుదలై థియేటర్స్‌‌లో సందడి చేస్తున్నాయి. మరోవైపు తమ సినిమాల కొత్త పోస్టర్స్‌‌తో ఈ సంక్రాంతికి కొత్త శోభను తీసుకొచ్చారు ఫిల్మ్ మేకర్స్. స్టార్ హీరోల సినిమాలు మొదలు చిన్న చిత్రాల వరకూ 2025 సంక్రాంతి స్పెషల్ విషెస్‌‌తో పొంగల్ పోస్టర్స్ హంగామా కనిపించింది.

తమిళనాట కూడా ఇదే జోష్ కనిపించింది. ఈ ఏడాది సంక్రాంతి పోస్టర్స్‌‌లో ‘రాజా సాబ్‌‌’గా ప్రభాస్ లుక్ ఇంప్రెస్ చేసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్‌‌‌‌లో ప్రభాస్ మరింత హ్యాండ్సమ్‌‌గా మెరిశాడు.

ఇక ‘లైలా’ పోస్టర్‌‌తో సర్‌‌ప్రైజ్‌ చేశాడు విశ్వక్ సేన్.  ఇందులో అమ్మాయిగా నటిస్తున్న విశ్వక్.. ఆ గెటప్‌‌లో గుర్తుపట్టలేనట్టుగా కనిపించాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌‌‌‌ను ఈనెల 17న రిలీజ్ చేయనున్నారు.

 ‘దిల్ రూబా’ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్‌‌‌‌లో కిరణ్ అబ్బవరం జాయ్​ఫుల్‌‌గా కనిపించాడు.  విశ్వ కరుణ్ దర్శకత్వంలో శివం సెల్యులాయిడ్స్,  ఏ యూడ్లీ ఫిలిం సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈనెల 18న ‘అగ్గిపుల్లె..’ అనే పాట విడుదల చేయనున్నారు.

శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘నారి నారి నడుమ మురారి’ అనే టైటిల్‌‌ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్‌‌ చేశారు. టైటిల్‌‌కు తగ్గట్టుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్‌‌‌‌ ఇంప్రెస్ చేసింది.  

ALSO READ | OMG : అర్థరాత్రి ఒళ్లంతా రక్తం.. ఆటోలో ఆస్పత్రికి సైఫ్ అలీఖాన్

సాక్షి వైద్య, సంయుక్త ఇందులో హీరోయిన్స్.  అనిల్ సుంకర ఎకే ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్ బ్యానర్‌‌‌‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

అనుష్క లీడ్‌‌ రోల్‌‌లో క్రిష్ తెరకెక్కిస్తున్న ‘ఘాటి’ చిత్రం నుంచి హీరో విక్రమ్ ప్రభు ఫస్ట్ లుక్, గ్లింప్స్‌‌ రిలీజ్ చేశారు. దేశీ రాజు అనే పాత్రలో వైలెంట్ క్యారెక్టర్‌‌‌‌లో ఆశ్చర్యపరిచాడు విక్రమ్ ప్రభు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి,  సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.

రోషన్ కనకాల హీరోగా ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న ‘మోగ్లీ 2025’ నుంచి హీరోయిన్ సాక్షి సాగర్‌‌ మదోల్కర్‌‌ పోషిస్తున్న జాస్మిన్ పాత్రని పరిచయం చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

అలాగే విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి రూపొందిస్తున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.

మరోవైపు కోలీవుడ్ నుంచి పొంగల్ విషెస్ చెబుతూ రజినీకాంత్ ‘జైలర్ 2’ అనౌన్స్‌‌మెంట్ వీడియో విడుదల చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌‌తో కట్ చేసిన ఈ టీజర్‌‌‌‌ అంచనాలు పెంచుతోంది.

అలాగే సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ‘రెట్రో’ నుంచి.. ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ‘ఇడ్లీ కడై’ నుంచి కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.