Happy New Year 2025: కొత్త సంవత్సరం సెలవులు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం...!

Happy New Year 2025:  కొత్త సంవత్సరం సెలవులు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం...!

కొత్త సంవత్సరం 2025 ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వచ్చే సంవత్సరం ఎప్పుడెప్పుడు సెలవలు వస్తాయా అని సాధారణంగా ఎదురు చూస్తుంటారు.   2025 సంవత్సరానికి గాను సాధారణ, ఆప్షనల్ హాలిడేస్‌ను  తెలంగాణ సర్కార్ ఖరారు చేసింది. ఈ ఏడాదిలో మొత్తంగా 27 సాధారణ, 23 ఆప్షనల్ హాలిడేస్ కలిపి మొత్తం 50 సెలవులు ఉన్నాయి.

2025లో జనరల్ హాలిడేస్‌ ఏంటంటే..

  • జనవరి 1 .... న్యూఇయర్
  • జనవరి 12... భోగి
  • జనవరి 14....సంక్రాంతి 
  • జనవరి 26....రిపబ్లిక్ డే 
  • ఫిబ్రవరి 26.... మహా శివరాత్రి
  • మార్చి 14.... హోళీ
  • మార్చి 30 .... ఉగాది 
  • మార్చి 31.... ఈద్ ఉల్ ఫితర్ 
  • ఏప్రిల్ 01... రంజాన్ 
  • ఏప్రిల్ 05...బాబు జగ్జీవన్ రాం జయంతి 
  • ఏప్రిల్ 06...శ్రీరామనవవి 
  • ఏప్రిల్ 14..... అంబేడ్కర్ జయంతి 
  • ఏప్రిల్ 18... గుడ్ ఫ్రైడే 
  • జూన్ 07.... బక్రీద్ 
  • జులై 06.... మొహర్రం 
  • జులై 21.... బోనాలు 
  • ఆగస్టు 15.... ఇండిపెన్‌డెన్స్ డే 
  • ఆగస్టు 16... శ్రీ కృష్ణాష్టమి 
  • ఆగస్టు 27.... వినాయక చవితి 
  • సెప్టెంబర్ 05....ఈద్ మిలాదిన్ నబీ 
  • సెప్టెంబర్ 21....బతుకమ్మ మొదటి రోజు 
  • అక్టోబర్ 02.... దసరా/గాంధీ జయంతి 
  • అక్టోబర్ 03.... విజయదశమి తర్వాతి రోజు 
  • అక్టోబర్ 20.... దీపావళి 
  • నవంబర్ 05.... కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి
  • డిసెంబర్ 25... క్రిస్టమస్ 
  • డిసెంబర్ 26... క్రిస్టమస్ తర్వాతి రోజు