క్రికెట్ ప్రేమికులకు శుభవార్త ఇది. ప్రతిష్టాత్మక విశ్వక్రీడల్లో మనం క్రికెట్‌ను చూడబోతున్నాం. మరో ఐదేళ్లలో ఆ కల నెరవేరనుంది. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ లో క్రికెట్‌ను భాగం చేసేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఆమోదం తెలిపింది.
సోమవారం ముంబైలో జరిగిన ఐఓసీ సమావేశంలో.. క్రికెట్‌తో పాటు సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్సె (సిక్సెస్), స్కాష్ క్రీడలు కూడా 2028 ఒలింపిక్స్‌లో భాగం చేయబోతున్నట్లు తెలిపింది. అయితే, ఇద్దరు సభ్యులు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఓటింగ్ ఏకగ్రీవంగా జరగలేదు. ఆరేసి జట్లు చొప్పున పురుషుల, మహిళల క్రికెట్ జట్లు టీ20 ఫార్మాట్‌లో బరిలోకి దిగనున్నాయి.
128 ఏళ్ల తర్వాత
తొలిసారి 1900 పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ సమయంలో క్రికెట్ క్రీడలను నిర్వహించారు. అప్పట్లో గ్రేట్ బ్రిటన్ జట్టు ఫైనల్లో ఫ్రాన్స్‌ను 158 పరుగుల తేడాతో ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది.
Cricket will be played in T20 format in the Olympics 2028....!!!!
— Johns. (@CricCrazyJohns) October 16, 2023
- First time in 128 years of Olympic history. pic.twitter.com/Gz0vxr1Y6X
The official poster of Olympic games welcoming 5 sports in Los Angeles 2028.
— Johns. (@CricCrazyJohns) October 16, 2023
- Virat Kohli, face of world cricket. pic.twitter.com/MTSuvtrwEY