2036 ఒలింపిక్స్ భారత్‎లో నిర్వహించి తీరుతాం: కేంద్రమంత్రి మన్‎సూఖ్ మాండవీయ

2036 ఒలింపిక్స్ భారత్‎లో నిర్వహించి తీరుతాం: కేంద్రమంత్రి మన్‎సూఖ్ మాండవీయ

హైదరాబాద్: 2036 ఒలింపిక్స్ భారత్‎లో నిర్వహించి తీరుతామని కేంద్ర క్రీడ శాఖ మంత్రి మన్‎సూఖ్ మాండవీయ అన్నారు. ఇవాళ (సెప్టెంబర్ 20) హైదరాబాద్‎లోని గచ్చిబౌలి స్టేడియాన్ని విజిట్ చేసిన మాండవీయ.. ఇటీవల ముగిసిన పారా ఒలింపిక్స్‎లో బ్రాంజ్ మెడల్ సాధించిన తెలంగాణ బిడ్డ, అథ్లెట్ దీప్తి జీవంజిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..- పిల్లల్ని క్రీడలలో ప్రోత్సహించాలని.. ఫిట్‎గా, హెల్తీగా ఉండాలంటే ఎదో ఒక ఆట ఆడాలని సూచించారు. 

 రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నామని..- ప్రధాని మోడీ ఉద్దేశ్యం కూడా క్రీడల్ని, క్రీడాకారుల్ని ప్రోత్సహించడమేనని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల్లో క్రీడాసదుపాయాల్ని పెంచుతున్నామని అన్నారు. గ్రామీణ స్థాయి క్రీడకారుల ప్రతిభను వెలికి తీసేందుకు- ఖేలో ఇండియా పోటీలు నిర్వహిస్తున్నామని.. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. విశ్వక్రీడలు ఒలింపిక్స్‎లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసేలా కృషి చేస్తామని తెలిపారు.

ALSO READ | మంచులో చిక్కుకున్న సోల్జర్ .. 36 గంటల తర్వాత కాపాడిన్రు

స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. - కేంద్ర మంత్రి రాష్ట్ర పర్యటన ఉందని తెల్వగానే స్టేడియం విజిట్ చెయ్యాలని కోరామని.. సానుకూలంగా స్పందించి స్టేడియానికి వచ్చినందుకు  మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో క్రీడలు కనుమరుగయ్యాయని.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మళ్లీ రాష్ట్రంలో క్రీడలు జీవం పోసుకుంటున్నాయన్నారు. క్రీడలకు ప్రభుత్వం బడ్జెట్ మంచి కేటాయింపులు చేసిందని.. ఇటీవలే ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ పోటీలు ఘనంగా నిర్వహించామని గర్తు చేశారు. రాష్ట్రంలో క్రీడాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నానని.. స్టేడియాల రేనోవేషన్‎కి బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్‏ను రిక్వెస్ట్ చేశారు.