హైదరాబాదులో 208 మంది పాకిస్తానీలు

హైదరాబాదులో 208 మంది పాకిస్తానీలు

పహల్గాం ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారించుకున్న భారత్..ఉగ్రవాదులు, వారికి సపోర్టు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదని శపథం చేసింది. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల నిలిపివేత, పాక్ తో దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకుంది.  భారత్ లో ఉన్న పాకిస్తానీలు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది.

ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీలను గుర్తించి వెంటనే దేశం నుంచి పంపించాలని కోరింది. ఇప్పటికే పాకిస్తానీలకు జారీ చేసిన వీసాలను రద్దు చేసిన కేంద్రం.. ఏప్రిల్ 29లోగా దేశం విడిచి పోవాలని తెలిపింది. 

 కేంద్రం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు పాకిస్తానీల గుర్తించే పని మొదలు పెట్టారు. ఈ క్రమంలో తెలంగాణలోని ముఖ్యంగా హైదరాబాద్ లో ఉంటున్న పాకిస్తానీల వివరాలను హైదరాబాద్ ఎస్బీ అధికారులు సేకరించారు. హైదరాబాద్ లో మొత్తం 208 మంది పాకిస్తానీలు ఉంటున్నట్లు గుర్తించారు. వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్, 13మందికి షార్ట్ టర్మ్, 39 మందికి బిజినెస్ వీసాలు ఉన్నట్లు తేలింది.