తెలంగాణలో మరో 2,092 కరోనా కేసులు

తెలంగాణలో మరో 2,092 కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో మరో 2092 కొత్త కరోనా కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,050కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,358 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. 52,103 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం కరోనా బారినపడి 13 మంది మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 589కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,793 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. బుధవారం రాష్ట్రంలో 21,346 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దాంతో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 5,43,489కి చేరింది.

జీహెచ్ఎంసీలో 535, రంగారెడ్డిలో 169, వరంగల్ అర్బన్ 128, మేడ్చల్ లో 126, కరీనంగర్ లో 123, సంగారెడ్డి 101, నిజామాబాద్ 91, సిరిసిల్ల 83, గద్వాల 72, ఖమ్మం 64, పెద్దపల్లి 54, నల్లొండ 52 కేసులు నమోదయ్యాయి.

For More News..

కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి

జ‌మ్ముక‌శ్మీర్ తొలి గ‌వ‌ర్న‌ర్ రాజీనామా.. రెండో గవర్నర్‌గా మ‌నోజ్ సిన్హా

లాలూను రిమ్స్ నుంచి తరలించిన అధికారులు.. కారణమదేనా?

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత