సీఐఐ గ్రీన్ సిమెంటెక్‌‌‌‌‌‌‌‌ 20వ ఎడిషన్ ప్రారంభం

సీఐఐ గ్రీన్ సిమెంటెక్‌‌‌‌‌‌‌‌ 20వ ఎడిషన్ ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సిమెంట్ మాన్యుఫాక్చరర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ (సీఎంఏ)తో కలిసి సీఐఐ నిర్వహిస్తున్న యాన్యువల్ సిమెంట్ కాన్ఫరెన్స్ గురువారం ప్రారంభయ్యింది. శుక్రవారం ముగుస్తుంది. నెట్ జీరో కార్బన్‌‌‌‌‌‌‌‌కు కమిట్ అవ్వడంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా వాతావరణ మార్పుపై పోరాడడమే కాకుండా బోలెడు వాణిజ్య ప్రయోజనాలను కూడా కంపెనీలు పొందొచ్చని సీఐఐ గ్రీన్ సిమెంటెక్‌‌‌‌‌‌‌‌ 20 వ ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో   జేకే సిమెంట్ సీఈఓ మాధవకృష్ణ సింఘానియా అన్నారు.

 సిమెంట్ ఉత్పత్తిలో ఇండియా రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంది.  2026 వరకు ఏడాదికి 7 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని  అంచనా. నెట్‌‌‌‌‌‌‌‌ జీరో కార్బన్ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఇండియా చేరుకోవడంలో సిమెంట్ సెక్టార్ కీలక పాత్ర పోషిస్తుందని సిమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ నీరజ్‌‌‌‌‌‌‌‌ అఖౌరీ అన్నారు.