ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ మరోసారి విశ్వ రూపం చూపించింది. పవర్ ప్లేలో ఆ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. తొలి ఆరు ఓవర్లలో ఏకంగా 88 పరుగులు రాబట్టింది. ఈ సీజన్ లో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం. ముఖ్యంగా ఓపెనర్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. నరైన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ తొలి రెండు ఓవర్లలో 17 పరుగులతో పర్వాలేదనిపించింది. అయితే మూడో ఓవర్ నుంచి అసలైన అసలైన విధ్వంసం సాగింది. ఖలీల్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇక ఇశాంత్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో నరైన్ 6,6,4,0,6,4 తో మొత్తం 26 పరుగులు రాబట్టాడు. 5 ఓవర్లో 12, ఆరో ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. సాల్ట్ 4 ఫోర్లతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు.
FIFTY FOR SUNIL NARINE....!!!
— Johns. (@CricCrazyJohns) April 3, 2024
- The main of KKR is back, fifty from just 21 balls against Delhi, What a batting, he is destroying DC bowling at Vizag. 🔥 pic.twitter.com/H1vFH0vPb9