మాదాపూర్, వెలుగు: మాదాపూర్ శిల్పారామంను బుధవారం 21 మంది విదేశీ మీడియా ప్రతినిధులు సందర్శించారు. అక్కడి హస్తకళా రూపాలను, పల్లె వాతావరణాన్ని చూసి మైమరిచిపోయారు. అనంతరం కళాకారులు రితిక, కుమారి తనిష్కల కూచిపూడి నృత్య ప్రదర్శన విదేశీ ప్రతినిధులను ఆకట్టుకుంది.
ఈ పర్యటనలో ఈస్ట్ఆసియా, యూరేసియా, మిడిల్ఈస్ట్ప్రాంతంలోని జార్జియా, ఆర్మేనియా, ఇరాన్, బెలారస్, తుర్క్మెనిస్తాన్, కిర్గిజ్రిపబ్లిక్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మంగోలియా, కజకిస్తాన్దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు, భారత విదేశీ డిప్లొమా డివిజన్ అధికారులు పాల్గొన్నారు.