మహిళా పోలీసులు పెరిగిన్రు

దేశంలో లక్షమంది జనాభాకి 193 మంది పోలీసులే ఉన్నారు. అందులోనూ మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య మరీ తక్కువ. ఇప్పుడిప్పుడే సోషల్​ బారికేడ్స్​ని దాటుకుని ఆడవాళ్లు పోలీసు ఫోర్స్​లో చేరుతున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్​ రెడ్డి రిలీజ్​ చేసిన ‘పోలీసు ఆర్గనైజేషన్ల డేటా-2018’ ప్రకారం పోలీసు ఫోర్స్​లో మహిళల సంఖ్య 21 శాతం పెరిగింది. అయినప్పటి కీ మొత్తం పోలీసుల్లో లేడీ కానిస్టేబుళ్లు 8.73 శాతం మాత్రమే. డొమెస్టిక్​ వయొలెన్స్, సెక్సువల్​ అసాల్ట్​ వంటివి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కనీసం 33 శాతానికి మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య ను పెంచాలంటున్నారు పోలీస్​ పెద్దలు.

లేడీ పోలీసును చూస్తే ఇప్పటికీ జనంలో ఒక రకమైన ఆశ్చర్యం కనబడుతుంది. నిజానికి, మన దేశంలో మహిళా కానిస్టేబుళ్ల నియామకం 1933 నుంచే మొదలైంది. కేరళలోని ట్రావెన్కూర్​ రాయల్​ పోలీసు ఫోర్స్​లో ఫస్ట్​ లేడీ కానిస్టేబుల్​ చేరినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత నలభై ఏళ్లకుగానీ ఫస్ట్​ మహిళా ఐపీఎస్​ ఆఫీసర్​ (కిరణ్​ బేడీ, 1972) సర్వీసులోకి రాలేదు. ఆడవాళ్లు పోలీసు ఫోర్స్​లో చేరడమనేది కేవలం వాళ్లకు ఉత్సాహం ఉంటే చాలదు. ఎంకరేజ్​ చేయడానికి కుటుంబం, చుట్టుపక్కల వాతావరణం, చుట్టూ ఉండేవాళ్లు ఇలా చాలా అంశాలు అనుకూలించాలి. ప్రస్తుతం మన దేశంలో ఉమెన్​ పోలీసులు 1,69,550 మంది ఉన్నారు. గతంతో పోలిస్తే వీరి సంఖ్య బాగా పెరిగింది. పోలీసు ఆర్గనైజేషన్ల డేటా (డీఓపీడీ–2018)నుబట్టి ఆడ పోలీసుల శాతం 21 శాతం పెరిగినట్లుగా తెలుస్తోంది. 2018నాటికి మొత్తం పోలీసు దళంలో మహిళల శాతం 8.73 శాతానికి చేరింది. అంతకుపోయినేడాది 7.28 శాతమే ఉండేది. ఈ లెక్కన మహిళా కానిస్టేబుల్స్​ సంఖ్యలో 1.45 శాతం మేర పెరుగుదల ఉంది.

డీఓపీడీ–2018 ప్రకారం… దేశంలో పోలీసు స్టేషన్లు 16,422 వరకు ఉన్నాయి. ఇక, రాష్ట్ర స్థాయి పోలీసు ఫోర్స్​లో 19,686 మంది పెరగ్గా, సెంట్రల్​ సాయుధ​ పోలీసు దళాల్లో 16,051 మంది మహిళలు పెరిగారు. దేశ జనాభాకి తగినట్లుగా పోలీసుల సంఖ్య లేదు. ప్రస్తుతం ప్రతి లక్ష జనాలకు 193 మంది మాత్రమే పోలీసులు ఉన్నారు. టెక్నాలజీ పెరగడంతోపాటు దానికి సంబంధించిన నేరాలుకూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సైబర్​ నేరాలు విపరీతమవుతున్నాయని రోజువారీ క్రైమ్​ న్యూస్​ని బట్టి తెలుస్తోంది. సైబర్​ పోలీసు స్టేషన్లు 2017నాటికి 84 ఉండగా, పోయినేడాది మరో 36 పెరిగి, 120కి సైబర్​ పీఎస్​లు చేరాయి.  అయితే, ఎక్కడికక్కడ కెమెరాల ద్వారా నిఘా వేయడాన్ని పెంచారు. కీలకమైన చోట్లను గుర్తించి సర్వైలెన్స్​ కెమెరాలు ఎక్కువగా అమర్చారు. రెండు లక్షల 10 వేలకు పైన ఉండే నిఘా కెమెరాలు… తాజాగా 2,75,468కి పెరిగాయి.

2017–18 నడుమ ఏడాది కాలంలో పోలీసు ఫోర్స్​కి మౌలిక సదుపాయాల్నికూడా బాగా అభివృద్ధి చేశారు.  పోలీసు రిక్రూట్​మెంట్​ బాగా జరిగింది. అలాగే, అన్ని రాష్ట్రాల్లోనూ, యూనియన్​ టెరిటర్రీల్లోనూ, సీఆర్​పీఎఫ్​, సెంట్రల్​ పోలీసు ఆర్గనైజేషన్లలోనూ  వేర్వేరు స్థాయిల్లో 1,24,429 మందిని రిక్రూట్​ చేసుకున్నట్లుగా డీఓపీడీ–2018 పేర్కొంది. కాగా, మహిళలు పోలీసు ఫోర్స్​లో చేరడానికి మరింత ముందుకు రావాలని పెద్ద పోలీసాఫీసర్లు అంటున్నారు. దేశంలో మహిళలు అటు నేరాల్లోనూ, ఇటు బాధితుల్లోనూ పెరుగుతున్నందున లేడీ కానిస్టేబుళ్ల సంఖ్య సరిపడనంత లేరన్నది వాళ్ల అభిప్రాయం. దళిత మహిళలపై ఇతర కులాలవారు, అదే ఎస్సీ కమ్యూనిటీకి చెందినవారుకూడా అత్యాచారాలకు పాల్పడడం పెరిగిందని ఇటీవల నేషనల్​ క్రైమ్​ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన రిపోర్టు వెల్లడించింది. ఇలాంటివాటిని విచారించాలన్నా, బాధితులతో సున్నితంగా వ్యవహరించాలన్నా మహిళా కానిస్టేబుళ్లు ఎక్కువగా ఉండాలన్న డిమాండ్​ చాలాకాలంగా వినబడుతోంది.

మహిళా కానిస్టేబుళ్లు ఎందుకు పెరగాలంటే…

మహిళల సంఖ్య పెంచాలన్న డిమాండ్​ వెనుక వాళ్ల పనితీరు దాగి ఉంది. మగ పోలీసుల మాదిరిగా చీటికిమాటికీ లాఠీ భాష వాడరన్నది ముఖ్యమైంది. పరిధి దాటిపోయి మగవాళ్లు డ్యూటీ చేస్తారని, ఆడ పోలీసులు ఎక్​స్ట్రాలు చేయరని చెబుతారు. అలాగే, అత్యాచారం​ అనేది చాలా సున్నితమైన అంశం.  లైంగిక వేధింపుల కేసుల విషయంలో బాధితురాళ్లు ఓపెన్​గా మాట్లాడాలంటే జంకుతారు. మహిళా కానిస్టేబుళ్లున్నట్లయితే కేసువివరాలన్నీ బయటకు వస్తాయి.

మూడో వంతు మహిళలకే….

దాదాపుగా పదేళ్ల క్రితమే కేంద్ర హోం మినిస్ట్రీ లేడీ పోలీసుల సంఖ్య పెంచాలని గైడ్​లైన్స్​ రిలీజ్​ చేసింది. మొత్తం పోలీసు ఫోర్స్​లో 33 శాతం మహిళలను రిక్రూట్​ చేసుకోవాలన్నది దానిలో ప్రధానాంశం. ఈ గైడ్​లైన్స్​ని కేవలం ఏడెనిమిది రాష్ట్రాలే పట్టించుకున్నాయి. బీహార్​లో అత్యధికంగా మహిళా కానిస్టేబుళ్లుంటారని అంచనా. 2013లో మరోసారి కేంద్రం అన్ని రాష్ట్రాలకు తాజా ఆదేశాలిస్తూ… రౌండ్​ ది క్లాక్​ ప్రతి పోలీసు స్టేషన్​లోనూ కనీసం ముగ్గురు మహిళా ఎస్​ఐలు, 10 మంది ఆడ పోలీసులు ఉండాలని పేర్కొంది. 2015లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని రాష్ట్రాల్లోనూ నేరాలు ఎక్కువగా జరిగే జిల్లాల్లో ప్రత్యేకంగా ‘మహిళలపై జరిగే నేరాల ఇన్విస్టిగేషన్​ కోసం యూనిట్లు (ఐయుసీఎడబ్ల్యు) ఏర్పడాలని చెప్పింది. ఈ యూనిట్లలో కనీసం అయిదుగురు మహిళలు సహా 15 మంది ఇన్వెస్టిగేషన్​ స్పెషలిస్టులుండాలని గైడ్​లైన్స్​ ఇచ్చింది.