హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 21 రైల్వే స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్లు’గా ఎంపిక చేసి.. రూ.891 కోట్లతో మోడర్నైజ్చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈనెల 6న ఈ పనులకు ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 39 స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్లు గుర్తించి మొదటి విడతగా 21 స్టేషన్లను ఎంపిక చేసినట్లు కిషన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మోడ్రనైజేషన్‌లో భాగంగా స్టేషన్లో స్వచ్ఛత, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం, ప్రయాణికుల వెయిటింగ్ హాల్స్, ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, స్టేషన్ ముందు, వెనక భాగాల్లో చిన్న గార్డెన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇవి కాకుండా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే 40 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా డెవలప్ చేసేందుకు రూ.715 కోట్లు, చర్లపల్లి టర్మినల్ అభివృద్ధికి రూ.221 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణలో మొత్తం గుర్తించిన స్టేషన్లు 39
హైదరాబాద్ (నాంపల్లి), హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, మలక్‌పేట్, మల్కాజ్‌గిరి, బేగంపేట్, ఉమ్దానగర్, యాకుత్‌పురా, మేడ్చల్, జడ్చర్ల, తాండూర్, వికారాబాద్, జనగాం, కాచిగూడ, ఆదిలాబాద్, బాసర, భద్రాచలం రోడ్, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, లింగపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల్, మిర్యాలగూడ, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్‌నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, వరంగల్, రాయగిరి(యాదాద్రి), జహీరాబాద్.