జగిత్యాల జిల్లాలో  21 పల్లె దవాఖానాలు ఏర్పాటు : ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 

జగిత్యాల జిల్లాలో  21 పల్లె దవాఖానాలు ఏర్పాటు : ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 

రాయికల్​, వెలుగు: జగిత్యాల నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా 21 పల్లె దవాఖానలు  మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​కుమార్​ తెలిపారు.  రాయికల్ మండలం బోర్నపల్లి , ధర్మాజీపేట గ్రామాల్లో  రూ. 20 లక్షల నిధుల వ్యయంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాల నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  డాక్టర్లు సేవ భావంతో పని చేసినప్పుడే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.

.జగిత్యాలలో మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్రంలోనే మొదటి అనుమతి జగిత్యాలకు వచ్చిందని చెప్పారు. రూ. 14 కోట్ల తో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయని తెలిపారు. రాయికల్ మండలానికే  6 పల్లె దవాఖానాలు మంజూరు చేశామని తెలిపారు. ఎంపీని  కోరగానే జగిత్యాలకు నవోదయ పాఠశాల మంజూరు చేయించారని జగిత్యాల రూరల్ మండలానికి  కేజీబీవీ పాఠశాల మంజూరు కు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఉప వైద్యాధికారి శ్రీనివాస్, నాయకులు కోల శ్రీనివాస్, రవీందర్ రావు,  తదితరులు పాల్గొన్నారు.