ములుగు జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 21 సెంటర్లు

  • ములుగు అడిషనల్​  కలెక్టర్

ములుగు, వెలుగు :  పదో తరగతి  పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్​  కలెక్టర్  మహేందర్​  అధికారులకు సూచించారు.  సోమవారం ములుగు కలెక్టరేట్​ లో  సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈనెల 18 నుంచి  నుంచి ఏప్రిల్​ 2వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని, అందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.  

జిల్లాలో 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 3,092మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. 200లమంది ఇన్విజిలేటర్లు, 21మంది చీఫ్ సూపర్​ వైజర్లు, ఇద్దరు ఫ్లయింగ్​ స్క్వాడ్​ లను నియమించామని వెల్లడించారు.

 సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాధికారి జి. పాణిని, డీఎంహెచ్​ఓ డాక్టర్​ అప్పయ్య, కరెంట్​ శాఖ  డీఈ నాగేశ్వర్​ రావు, డీపీవో స్వరూప రాణి, డీఎస్​వో జయదేవ్​, శంకర్​ తదితరులు పాల్గొన్నారు.