పీజీ కోర్సుల్లో 21,505 మందికి సీట్లు

పీజీ కోర్సుల్లో 21,505 మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: పీజీ కోర్సుల్లో (ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్) అడ్మిషన్ల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28,323 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వాటిలో 21,505 మందికి సీట్టు అలాట్ చేసినట్టు సీపీగెట్ ప్రొఫెసర్ ఐ.పాండురంగారెడ్డి చెప్పారు. దీనిలో అమ్మాయిలు 15,694 మంది ఉండగా, అబ్బాయిలు 5,811 మంది ఉన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 13లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని పాండురంగారెడ్డి సూచించారు.

అన్ని యూనివర్సిటీల పరిధిలో 99 కోర్సుల్లో సీట్ల కేటాయింపు చేశారు. అత్యధికంగా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లో 1,570 మంది,  ఎంఎస్సీ జువాలజీ 1,410, ఎంఏ ఇంగ్లీష్ 1,294, ఎంఎస్సీ కెమిస్ట్రీ (ఆర్గానిక్)లో 1,228,  ఎంఎస్సీ బాటనీలో 1,196, ఎంఏ తెలుగు 1,117, ఎంకామ్ లో 1,016 మందికి సీట్లు కేటాయించారు. అయితే, అత్యధికంగా ఓయూ పరిధిలోనే 9వేల మందికి సీట్లు అలాట్ అయ్యాయి.