ఖమ్మం జిల్లాకు రూ.2.10 కోట్ల నిధులు : నామా నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాలకు రూ.2.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.  స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు కోరిక మేరకు ఈ నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.  భద్రాద్రి కొత్తగూడెం బాబు క్యాంప్, జూలూరుపాడు మండలం పాపకొల్లు ( కొత్తూరు ) గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.