అతి పెద్ద డెమొక్రటిక్ దేశమైన ఇండియాలో ఇప్పటి వరకు 16 లోక్ సభ ఎలక్షన్స్ జరిగాయ. తొలి పార్లెమెంట్ 1952 లో ఏర్పడింది. ఈ 67 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు, సంచలనాలు,వివాదాలు చోటుచేసుకున్నాయి. ఐదేళ్లకొకసారి నిర్వహించాల్సిన ఈ ఎన్నికలను ఎనిమిది సార్లు మాత్రమే గడువు ప్రకారం జరిపారు. 1998లో ఏడాది వ్యవధిలోనే ప్రజాతీర్పు కోరగా, మరోసారి 1971లో ఆరేళ్ల వరకు ఆగాల్సి వచ్చింది. మొదట్లో బ్యాలెట్ పేపర్ వాడేవారు. ఇప్పుడు ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు.
ఎక్కువ కాలం ప్రధాని
1947 లో స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే నెహ్రూ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటికి దేశంలో రాజ్యాం గం అమల్లోకి రా లేదు. బ్రిటిషర్ల పాలన ముగిసినప్పటికీ గవర్నర్ జనరల్ పదవి కొనసాగింది. 1950 జనవరి 26న ఇండియా రిపబ్లిక్ గా అవతరించిం ది. 1952లో జరిగిన తొలి ఎన్ని కల్లోనూ, 1957, 62ల్లో జరిగిన రెండు ఎన్ని కల్లోనూ కాం గ్రెస్ పార్టీయే గెలవడంతో, నెహ్రూ ప్రధానిగా
తక్కువ కాలం ప్రధాని
పండిట్ నెహ్రూ మరణం తర్వాత గుల్జా రీలాల్ నందా ప్రధాని అయ్యారు. 1964 మే 27 నుంచి, జూన్ 9 వరకు 13 రోజులపాటు ఆ పదవిలో కొనసాగారు. పార్లమెంటరీ పార్టీ లా ల్ బహదూర్ శాస్త్రిని ఎన్నుకోవడంతో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. రాజ్యాంగంలో తాత్కాలిక లేదా డిప్యూటీ ప్రధానమంత్రుల పదవులు లేవు. కాబట్టి, నందాని రెండో ప్రధానిగా భావిం చాల్సి వస్తుంది.
1952
మొదటిసారిగా 489 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఓటర్లు 17.3 కోట్లు. 12 లక్షల బ్యాలెట్ పెట్టెలను, 62 కోట్ల బ్యాలెట్ పేపర్లను వాడారు. కాం గ్రెస్364 చోట్ల గెలిచిం ది. 45 శాతం ఓట్లు వచ్చాయి. సీపీఐకి 16, సోషలిస్టు పార్టీకి 12 సీట్లు దక్కాయి. భారతీయ జన సంఘ్ పార్టీ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది.37 మంది ఇండిపెండెంట్లు గెలిచారు.
1957
ఓటర్ల సంఖ్య 26.52 కోట్లకు పెరిగింది.494 స్థానాల్లో కాం గ్రెస్ 371 చోట్ల విజయ దుందుభి మోగించింది. సీపీఐకి 27, ప్రజా సోషలిస్టు పార్టీకి 19,భారతీయ జన సంఘ్ కు 4 స్థానాలు వచ్చాయి. మహిళలు పోటీ చేయలేదు. వరుసగా రెండోసారి నెహ్రూ ప్రధాని అయ్యారు.
1962
కాంగ్రెస్ పార్టీ, పండిట్ నెహ్రూ హ్యాట్రిక్ సాధించారు. 494 సీట్లకు 361 స్థానాలు గెలుచుకుం ది. సీపీఐకి 27, ప్రజా సోషలిస్ట్ పార్టీకి 17 స్థానాలు వచ్చాయి.మూడోసారి నెహ్రూ పీఎం అయ్యారు.
1967
కాంగ్రెస్ వరుసగా నాలుగోసారి విజయం సాధించిం ది. 520 స్థనాలకు ఆ పార్టీ 283 సీట్లు గెలిచింది. ఓట్ల శాతం 41కి తగ్గింది. 1962తో పోల్చితే 82 సీట్లు కోల్పోయింది. సి .గోపాలచారికి చెందిన స్వతంత్ర పార్టీ 44 సీట్లు సాధించింది. ఈ టర్మ్‌లో కాంగ్రెస్ పార్టీ. రెండుగా చీలింది.
1971
ఇందిర నాయకత్వంలో కాంగ్రెస్ (ఆర్) పార్టీ 352 సీట్లు గెలుచుకుంది. 1967తో పోలిస్తే 70 సీట్లు అదనంగా పొందింది. సీపీఎంకి 29, కాంగ్రెస్ (ఓ)కి 16 స్థానాలు వచ్చాయి. సంజయ్ గాంధీ ప్రాబల్యం , ఇందిర నియంతృత్వం , ఎమర్జెన్సీ వంటివన్నీ ఈ ఎన్ని కల తర్వాతే జరిగాయి. 1976 మార్చిలో జరగాల్సిన ఎన్నికలు ఎమర్జెన్సీవల్ల జరగలేదు.
1977
కాంగ్రెస్ తొలిసారిగా అధికారం కోల్పోయింది. ఆ పార్టీని జనతా పార్టీ మట్టి కరిపించిం ది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఏడు పార్టీలు జనతా పార్టీగా ఏర్పడ్డాయి. 542 సీట్లలో 295 స్ థా నాలను సొం తం చేసుకున్నాయి. కాం గ్రెస్ 154 సీట్లతో సరిపెట్టుకుంది. 1971తో పోల్చితే 198 స్థానాలు తగ్గాయి. ఇందిర ఓడిపోయారు.
1980
కాంగ్రెస్ (ఐ) పుంజుకుంది. జనతా పార్టీ లో విభేదాలు ఇందిర పార్టీకి కలిసొచ్చాయి. 529 స్థానాల్లో కాం గ్రెస్ (ఐ) 353 సీట్లను గెలుచుకుంది. జనతా పార్టీ.
1984
ఇందిరాగాంధీ హత్యతో రాజీవ్ గాంధీ నేతృత్వం లోని కాం గ్రెస్ అఖండ మెజారిటీ సాధించింది. 514 సీట్లకు 404 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. లోక్‌సభలో తొలిసారిగా 30 సీట్లతో ప్రాంతీయ పార్టీ (టీడీపీ) ప్రతిపక్షంగావ్యవహరించటం విశేషం.
1989
ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో తొలిసారిగా హంగ్ ఏర్పడింది. 529 స్థానాల్లో కాంగ్రెస్ 197, జనతాదళ్ 143,బీజేపీ 85 సీట్లు సాధించాయి. బీజేపీ,లెఫ్ట్ పార్టీల మద్దతుతో జనతాదళ్ పార్టీ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
1991
ఎన్నికలు మండల్ –మందిర్ అంశాలపై జరిగాయి. మరోసారి ఏ పార్టీకీ మెజా రిటీ రాలేదు. కాంగ్రెస్ 232, బీజేపీ 120, జనతాదళ్ 29 సీట్లు పొందాయి.
1996
మళ్లీ హంగ్ ఏర్పడింది. వాజ్ పేయి నేతృత్వంలో బీజేపీ 161 సీట్లు దక్కిం చుకుంది. మిగతా అన్ని పార్టీలతో పోల్చితే కమలదళం సాధించిన ఈ స్థానాలే అత్యధికం. లోక్‌సభలో ఏ పార్టీ కూడా మెజా రిటీ నిరూపించుకోలేకపోయిం ది.13 రోజుల తర్వాత ప్రధాని వాజ్ పేయి రాజీనామా చేయడంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వమేర్పడింది.
1998
ఈ ఎన్నికల్లో బీజేపీ మరింత పుంజుకుని182 సీట్లు గెలిచిం ది. కాంగ్రెస్ కు 141, ప్రాంతీయ పార్టీలకు 101సీట్లు వచ్చాయి. వాజ్ పేయి (బీజేపీ) ఆధ్వర్యం లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది.
1999
13 నెలల తర్వాత మరోసారి మధ్యంతర ఎన్ని కలు జరిగాయి. బీజేపీకి 180 సీట్లు దక్కాయి. మొత్తంగా ఎన్డీఏ 299 స్థానాలను కైవసం చేసుకుంది. కాం గ్రెస్ 114, ప్రాంతీయ పార్టీలు 158 సీట్లు సాధించాయి. ఎన్డీఏ తరఫున వాజ్ పేయి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు
2004
బీజేపీకి 138, కాం గ్రెస్ కు 145, ప్రాం తీయ పార్టీలకు 159 స్ థా నాలు దక్కాయి. లెఫ్ట్ మద్దతుతో కాం గ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ సర్కారు ఏర్పడింది. నెహ్రూ కుటుం బానికి చెందని వ్యక్తి (మన్మోహన్ సింగ్ ) పదేళ్లపాటు ప్రధానిగా ఉన్నారు.
2009
వరుసగా రెండోసారి యూపీఏ అధికారంలోకి వచ్చింది. 543 సీట్లకుగాను కాం గ్రెస్ 206, అద్వానీ సారథ్యంలోని బీజేపీ 116, ప్రాంతీయ పార్టీలు 146 సీట్లు గెలిచాయి.
2014
గుజరాత్ సీఎం నరేం ద్ర మోడీని పీఎం అభ్యర్థి గా ప్రకటిం చడంతో బీజేపీ సొం తంగా 282 స్థానాలు గెలుచుకుంది. ఎన్డీఏలోని అన్ని పార్టీలు కలిసి 336 సీట్లను పొందాయి. ఇండియన్ పార్లమెంటరీ చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ అతి తక్కువ (44) సీట్లకు పరిమితమైంది.