
హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో 21,174 మంది నోటాకు ఓటేశారు. వర్ధన్నపేటలో 3,612 , పాలకుర్తిలో 2,743, వరంగల్ వెస్ట్ లో 2,426 ఓట్లు నోటాకు పడ్డాయి. నర్సంపేట నియోజకవర్గంలో 738 ఓట్లు , భూపాలపల్లిలో 830, పరకాలలో 966, స్టేషన్ ఘన్ పూర్ లో 1,153, డోర్నకల్ లో 1,392, జనగామలో 1,467 ఓట్లు నోటాకు పోలయ్యాయి. వీటితో పాటు మహబూబాబాద్ లో 1,932, ములుగులో 1,937, వరంగల్ ఈస్ట్ లో 1,978 నోటాకు వేయడం విశేషం.