భారత్లో 200 దాటిన ఒమిక్రాన్ కేసులు

భారత్లో 200 దాటిన ఒమిక్రాన్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 213కు పెరిగింది. ఇప్పటివరకు ఒమిక్రాన్ తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరిన వారిలో 90 మంది పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రాల వారీగా ఒమిక్రాన్ కేసులను చూసుకుంటే ఢిల్లీ (57 కేసులు) టాప్ లో ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (54), తెలంగాణ (24) ఉన్నాయి.

ఇక, భారత్ లో కొత్తగా 6,317 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 318 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 6,906 మంది కొవిడ్ నుంచి రికవర్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేస్ లోడ్ 78,190గా ఉంది. గడిచిన 575 రోజుల్లో ఇదే అత్యల్పం. 

మరిన్ని వార్తల కోసం: 

నేను ఏ పాత్ర చేసినా రిస్ట్రిక్షన్స్ ఉండవ్

కళ్లలో కారం పొడి చల్లి.. కత్తులతో దాడి