చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు విడుదల

చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు విడుదల

స‌త్ప్రవ‌ర్తనతో జైలులో నడుచుకున్న ఖైదీలను క్షమాభిక్షతో విడుదల చేస్తున్నట్లు ఖైళ్ల శాఖ మంగళవారం ప్రకటించింది. ఖైదీల కుటుంబాలు ముంద‌స్తు విడుద‌ల కోరుతూ సీఎం రేవంత్‌ రెడ్డికి ద‌ర‌ఖాస్తు  చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గద‌ర్శకాల‌ ఆధారంగా ఖైదీల ముంద‌స్తు విడుద‌లకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి జైళ్ల శాఖ అధికారులను ఆదేశించారు. విడుద‌ల‌కు అర్హులైన ఖైదీల జాబితాను ప్రభుత్వానికి ఇచ్చారు. ఖైదీల విడుద‌ల‌కు  కేబినెట్ ఆమోద‌ముద్ర వేసింది. అనంత‌రం ఆ జాబితాకు గ‌వ‌ర్నర్ ఆమోదంతో  ఖైదీల ముంద‌స్తు విడుద‌ల‌కు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

త్వరలో చ‌ర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు విడుద‌ల అవ్వనున్నారు. 205 మంది యావ‌జ్జీవ శిక్ష ప‌డిన వారు, ఎనిమిది మంది త‌క్కువ కాలం శిక్షప‌డిన వారు ఉన్నారు. వీరంద‌రికి జైలులో వివిధ వృత్తులకు సంబంధించిన‌ నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇచ్చిన జైల్ అధికారులు. మెరుగైన ప్రవ‌ర్తన ద్వారా సమాజంలో తిరిగి క‌లిసిపోవ‌డానికి జైళ్ల శాఖ అధికారులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.