గోపాలపేట గ్రామంలో 216 కేజీల గంజాయి కాల్చివేత

గోపాలపేట గ్రామంలో 216  కేజీల గంజాయి కాల్చివేత

తల్లాడ,  వెలుగు: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన 216 కేజీల గంజాయిని తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలోని బయో వేస్టేజ్ బర్నింగ్ ప్లాంట్ లో దహనం చేశారు. కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేశ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవి పర్యవేక్షణలో గంజాయిని కాల్చివేశారు.  

ఖమ్మం త్రీ టౌన్ , ఖమ్మం ఖానాపురం హావేలి, వేంసూరు,  విఎం బంజర, వైరా, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, కారేపల్లి, ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 18 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు.  సీసీఆర్బీ సీఐ స్వామి, తల్లాడ ఎస్‌ఐ కొండలరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.