
మేడిపల్లి, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 2న(ఆదివారం) రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో నారపల్లిలోని భాగ్యనగర్ నందనవనం పార్కులో 21కె,10కె, 5కె, 2కె రన్లు నిర్వహిస్తున్నారు. ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొనాలని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి కోరారు. రన్‌కు సంబంధించిన బ్రోచర్ ను చెంగిచర్ల శాంతివనం పార్కులో సోమవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ రాచకొండ రన్నర్స్ యేటా ఈ రన్ నిర్వహిస్తోందన్నారు. సీఐలు కిషన్, జానీ, ఎస్సై లు నాగార్జున్, కృష్ణయ్య, అడ్వకేట్ శంకర్, ఓయూ జేఏసీ నాయకులు కట్ట శేఖర్, సోమేశ్, సంతోశ్, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.