కార్లు కడుగుతారా.. నీళ్లు వేస్ట్ చేస్తారా.. ఒక్కో ఫ్యామిలీకి రూ.5 వేల ఫైన్

అసలే మంచినీళ్లు తక్కువగా ఉన్నాయి.. నీళ్లు వేస్ట్ చేయొద్దని పదే పదే చెబుతున్నాం.. నీళ్లు లేక జనం అల్లాడుతున్నారు.. మంచి నీటి కొరత నివారణకు ఇప్పటికే పలుసార్లు సూచనలు, సలహాలు చేశాం.. అయినా మీరు మారకపోతే ఎలా.. అసలు ఏమనుకుంటున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బెంగళూరు వాటర్ సప్లయ్ బోర్డు. ఆదేశాలు ధిక్కరించి నీళ్లతో కార్లు కడిగినందుకు.. 22 కుటుంబాలకు.. ఒక్కో ఫ్యామిలీకి 5 వేల రూపాయల చొప్పున ఫైన్ వేసింది. మొత్తంగా నీళ్లు వేస్ట్ చేసినందుకు లక్షా 10 వేల రూపాయల జరిమానా వసూలు చేసింది బెంగళూరు వాటర్ సప్లయ్ బోర్డు.

బెంగళూరు సిటీలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే కార్లు, బైక్స్ కడగొద్దని.. గార్డెనింగ్ కోసం నీటిని ఎక్కువగా ఉపయోగించొద్దని.. అలా చేస్తే జరిమానా అంటూ హెచ్చరించింది. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. బైక్స్, కార్లు కడుగుతున్న కొంత మంది వ్యక్తుల ఫొటోలు, వీడియోలను స్థానికులు బెంగళూరు వాటర్ సప్లయ్ బోర్డుకు పంపించారు. ఏకంగా సోషల్ మీడియా ద్వారా ఈ ఫొటోలు, వీడియోలు రావటంతో.. వాటర్ బోర్డు చాలా సీరియస్ అయ్యింది. చర్యలు తీసుకోకపోతే మిగతా వాళ్లు లైట్ తీసుకునే ప్రమాదం ఉండటం.. 22 కుటుంబాలకు జరిమానా చేసింది. ఒక్కో ఫ్యామిలీకి 5 వేల చొప్పున డబ్బులు వసూలు చేసింది. 

ALSO READ :- Vijay-Mrunal Thakur: ఫ్యాన్స్తో హోళీ సంబరాలు..డ్యాన్స్ చేస్తూ అలరించిన విజయ్,మృణాల్

సిటీలో నీళ్ల కోసం జనం నానా ఇబ్బంది పడుతుంటే.. మీరు మాత్రం కార్లు, బైక్స్ కడుగుతారా.. ఆ మాత్రం జ్ణానం లేదా లేక ప్రభుత్వ ఆదేశాలు అంటే లెక్కలేదా అంటూ హెచ్చరించింది. ఫస్ట్ టైం కావటంతో 5 వేల ఫైన్ వేశామని.. మరోసారి ఇలా చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు అధికారులు.