కామారెడ్డి టౌన్, వెలుగు : కరెంట్ సమస్యలు తెలుసుకునేందుకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 22 ఫిర్యాదులు వచ్చాయి. తమ గ్రామాల్లో నిత్యం కరెంట్‌కోతలు ఏర్పడుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు వెల్లడించారు.
ఎస్ఈ ఆఫీస్, డివిజన్ ఆఫీస్, ఈఆర్వో ఆఫీసుల్లో ప్రతి సోమవారం పొద్దున 10 గంటల నుంచి పగలు 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్ఈ రమేశ్‌బాబు తెలిపారు. ఫస్ట్ డే నిర్వహించిన ప్రోగ్రాంలో జిల్లా వ్యాప్తంగా 22 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.