
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 22 మంది జూనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్ లభించింది. డీపీవో కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టుగా పనిచేస్తున్న 22 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, రూరల్ ఎంప్లాయిమెంట్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ సృజన ఉత్తర్వులు జారీచేశారు.