2023 ఆర్థిక సంవత్సరంలో భారత దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) కంపెనీ భారీ నికర లాభాల వృద్ధిని సాధించాయి. మెరుగైన మార్జిన్లతో 45.2 శాతం వృద్ధి ని సాధించి నికర లాభం రూ. 2లక్షల 69వేల కోట్లకు చేరింది.
ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం.. ఈ కంపెనీలు సమర్పించిన వార్షిక ఆర్థిక నివేదికల ఆడిట్ పై ఫలితాలు అంచనావేయడం జరిగింది. 2021-2023 మధ్య మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ కంపెనీల పనితీరును విశ్లేషించారు.
ఆర్బీఐ డేటా ప్రకారం.. 2023 ఆర్థిక సంవత్సరంలో FDI ల నికర లాభం మార్జిన్ 5.9 శాతం పెరిగింది. ఇదే 2022లో 4.9 శాతం ఉండగా.. 2021 ఆర్థిక సంవత్సరంలో 3.2 శాతంగా ఉంది. కోవిడ్ తర్వాత 2,272 కంపెనీలు వృద్దిని సాధించాయి. శాంపిల్ కంపెనీల నికర అమ్మకాలు అంతకుముందు గత ఆర్థిక సంవత్సరం 28.6 శాతం వృద్ధి తో పోలిస్తే 2023లో 21.1 శాతం పెరిగాయి.
Also read :చంపుతామంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు... బెదిరింపు ఫోన్ కాల్స్
డివిడెండ్లు
2023లో FDIల డివిడెండ్ చెల్లింపు కూడా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం కంటే 43.66 శాతం పెరిగి రూ.1లక్షల 45వేల కోట్ల నుంచి 2023లో రూ.2లక్షల 20వేల కోట్లకు పెరిగింది.