జనరల్​ స్టడీస్​​: భారతదేశంలో అధికార భాషలు ఎన్నో తెలుసా?

జనరల్​ స్టడీస్​​: భారతదేశంలో అధికార భాషలు ఎన్నో తెలుసా?

భిన్నత్వానికి నిలయమైన భారతదేశంలో లక్ష మందికిపైగా మాట్లాడే భాషలు 254 వరకు ఉన్నాయి. అందువల్లనే ప్రముఖ బ్రిటీష్​ రచయిత్రి బివరెడ్జ్​ భారతదేశం గొంతు విభిన్న శబ్దాలతో కూడుకున్నదిగా అభివర్ణించింది. మన దేశంలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్య పరిపాలనలోనూ కేంద్రరాష్ట్ర సంబంధాల్లోనూ న్యాయవ్యవస్థల్లోనూ వినియోగించే భాషలపైన ఒక స్పష్టమైన వైఖరిని అనుసరించడానికి మన రాజ్యాంగంలోని 17వ భాగాన్ని పొందుపర్చారు. జాతీయ అధికార రాజ భాషతోపాటు రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల వినియోగంపై మాత్రమే కాకుండా రాష్ట్రాలలో మైనార్టీ భాషల సంరక్షణ కూడా ఒక విధానాన్ని రాజ్యాంగంలో పొందుపర్చారు. భారతదేశంలో భాషలపై నిర్ణయాన్ని ప్రకటించే అధికారం మన రాజ్యాంగం భారత పార్లమెంట్​కు కల్పించింది. 

రాజ్యాంగంలోని 17వ భాగం భాషలకు సంబంధించిన అంశాలను 343–351 వరకు గల అధికరణల్లో భాషకు సంబంధించిన అంశాలు పొందుపర్చారు. రాజ్యాంగం ద్వారా గుర్తింపు పొందిన భాషల గురించి ఎనిమిదో షెడ్యూల్​లో పొందుపర్చారు.  343(1) అధికరణ ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీ భాషను రాజ్య అధికార భాషగా పేర్కొంటుంది. 343(2) ప్రకారం రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల వరకు ఇంగ్లీష్​ భాషను కూడా అనుసంధాన భాషగా వినియోగించవచ్చుని పేర్కొంటున్నది. 343(3) అధికరణ ప్రకారం భాషలకు సంబంధించిన అంశాలపై భారత పార్లమెంట్​ చట్టాలను రూపొందిస్తుంది. 1963లో జాతీయ అధికార భాషా చట్టాన్ని రూపొందించారు. అధికార భాషా చట్టాన్ని అనుసరించి ఇంగ్లీష్​ భాషపై గల 15 సంవత్సరాల పరిమితిని తొలగించారు. 

344 అధికరణను అనుసరించి జాతీయ భాషా కమిషన్​​ రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి ఏర్పాటు చేయవచ్చు. ఆ తదనంతరం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జాతీయ అధికార భాషా కమిషన్​ను ఏర్పాటు అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. మొదటి జాతీయ భాషా కమిషన్ ను 1955లో ఏర్పాటు చేశారు. మొదటి జాతీయ భాషా కమిషన్ చైర్మన్ బి.జి.ఖేర్. 

345 అధికరణను అనుసరించి రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషలకు ఆ రాష్ట్ర శాసనసభలు చట్టం ద్వారా అధికార హోదాను కల్పించారు. దయాభాయ్వ వర్సెస్​ నట్వర్​లాల్​ మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ హిందీ మాతృ భాషగా లేని రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ భాష విషయంలో స్థానిక మాతృ భాషను రాజ్యభాషగా వినియోగించినప్పటికీ ఆంగ్ల భాష కూడా వినియోగంలో ఉంటుంది.

346 అధికరణ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో గానీ లేక కేంద్రంతో గానీ ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు ఆంగ్ల భాషను వినియోగించవచ్చు. హిందీ భాషా రాష్ట్రాలు మాత్రం (మాతృ భాషను కలిగిన రాష్ట్రాలు) తమ ఉత్తర ప్రత్యుత్తరాలను హిందీ భాషలో వినియోగించవచ్చు. 

347 అధికరణను అనుసరించి వివిధ రాష్ట్రాల్లో వినియోగించే ప్రత్యేక భాషలు లేక ప్రత్యేక ప్రాంతంలో వినియోగించే భాషల సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయవచ్చు. 

348 అధికరణ హైకోర్టులు, సుప్రీంకోర్టుల్లో న్యాయవ్యవహారాలన్నింటిని అంటే విచారణ, తీర్పులను ఆంగ్ల భాషలోనే జరగాలని పేర్కొంటున్నది. హిందీ భాషా రాష్ట్రాల్లో హైకోర్టుల్లో హిందీ భాషా వినియోగానికి కూడా అవకాశం ఉంది. మదులిమాయే వర్సెస్​ వేద్​ ముని హెబియస్ కార్పస్ రిట్​ పిటీషన్​పై వాదనలు వినే సందర్భంలో హిందీలో వినడానికి అవకాశం కల్పించాలని కోరినప్పుడు ఇంగ్లీష్​ మాత్రమే సుప్రీంకోర్టులో వినియోగించాలని కోర్టు పేర్కొన్నది. 

349 అధికరణ సుప్రీంకోర్టులో గానీ లేక హైకోర్టుల్లో గానీ వినియోగించే భాషల విషయంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత ఏదైనా మార్పులు చేయాలంటే పార్లమెంట్​లో బిల్లులు ప్రవేశపెట్టడాని కంటే ముందు భారత రాష్ట్రపతి ముందస్తు అనుమతి పొందడం తప్పనిసరి. 350 అధికరణ ప్రకారం భాతర పౌరుడెవరైననూ తన సమస్యలను ఇబ్బందులను నివారించుకొనే సందర్భంలో ప్రభుత్వాలకు విన్నవించుకునేటప్పుడు తన అర్జీని ఏ భాషలోనైనా సమర్పించుకునే అధికారం కలిగి ఉంటారు. 

350(ఎ) అధికరణ ప్రకారం మాతృభాషలో విద్యా బోధనపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జారీచేసే ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. 350(బి) అధికరణ ప్రకారం మైనార్టీ భాషల సంరక్షణకు కేంద్రం జారీ చేసే ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. మైనార్టీ భాషల సంరక్షణకు ఢిల్లీలో ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించాలి. 

ఎనిమిదో షెడ్యూల్​

ఎనిమిదో షెడ్యూల్​ భారత రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు గుర్తింపు పొందిన భాషల సంఖ్య 14. కాగా ప్రస్తుతం గుర్తింపు పొందిన భాషల సంఖ్య 22. 

  • 1950 తర్వాత కాలంలో 
  • గుర్తింపు పొందిన 8 భాషలు. 
  •     21వ రాజ్యాంగ సవరణ చట్టం 1
  • 967: 15వ భాష సింధీ. 
  •  71వ రాజ్యాంగ సవరణ చట్టం 
  • 1992: 16వ భాష కొంకణి, 
  • 17వ భాష మణిపురి, 18వ భాష నేపాలీ.
  • 92వ రాజ్యాంగ సవరణ చట్టం 
  • 2003: 19వ భాష బోడో, 20వ భాష డోగ్రీ, 21వ భాష మైథిలీ, 22వ భాష సంతాలీ. 
  •  96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా ఒరియా అనే పదం స్థానంలో 
  • ఒడియా అనే పదాన్ని చేర్చారు. 
  •  ప్రస్తుతం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్​లో గుర్తింపు పొందిన 22 భాషల వరుస క్రమం. 
  • 1. అస్సామీ, 2. బెంగాలీ, 3. బోడో, 4. డోంగ్రీ, 5. గుజరాతీ, 6. హిందీ, 7. కన్నడ, 8. కశ్మీరీ, 9. కొంకణి, 10. మైథిలీ, 11. మళయాళం, 12. మణిపురి, 13. మరాఠీ, 14. నేపాలి, 15. ఒడియా, 16. పంజాబి, 17. సంస్కృతం, 18. సంతాలి, 19. సింథీ, 20. తమిళం, 21. తెలుగు, 22. ఉర్దూ. 
  • ఈ షెడ్యూల్​లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలన్నా అలాగే నూతన భాషలు చేర్చాలంటే కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది.