
పాకిస్తాన్ పౌరుల్లో మూర్ఖత్వం మరీ పీక్స్‌కు చేరింది. ఆటగాళ్లలో సత్తా లేక జట్టు ఓడిపోతే.. ఆ కారణాన్ని మనోళ్లపై రుద్దుతున్నారు. వారి ఓడిపోవడానికి భారత ప్రభుత్వం మంత్రశక్తులు ప్రయోగించిందట. ఇండియా -పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 22 మంది హిందూ పూజారులను (పండిట్లను) మోహరించి మంత్రతంత్రాలు జరిపించారని ఓ వర్గం పాకిస్తానీ టీవీ చర్చలో ఆరోపించింది.
వారు చెప్తున్న 22 మంది పండిట్లు.. ఇద్దరేసి చొప్పున ఒక్కో ఆటగాడిని ఆధీనంలోకి తీసుకున్నారట. పోనీ, అంతటితో ఆ పిచ్చి వాగుడు ఆపారా.. అంటే అదీ లేదు. మ్యాచ్‌కు ఒక రోజు ముందు, ఏడుగురు పూజారులు పిచ్, గ్రౌండ్‌ను సందర్శించి మాయాజాలం చేశారట. పాక్ క్రికెటర్లను తమ ఆధీనంలోకి తీసుకున్నాక.. భారత జట్టును విజయం వరించేందుకు విజయం పూజ, ప్రార్థనలు జరిపారట. 'డిస్కవర్ పాకిస్తాన్'లో ప్రసారమైన ఒక కార్యక్రమంలో ఒక ప్యానెల్ ఈ ఆరోపణలు చేసింది.
Also Read:-ఆస్ట్రేలియా క్రికెటర్‌కు స్మృతి మంధాన క్షమాపణలు..
"భారతదేశం 22 మంది పండిట్లను దుబాయ్ స్టేడియంకు పంపింది. ప్రతి ఆటగాడికి ఇద్దరు చొప్పున పండితులు చొప్పున బృందంలో ఉన్నారు. వారికి మాయాజాల శక్తులు ఉన్నాయి. పాకిస్తాన్ ఆటగాళ్లు పరధ్యానంలో ఉండిపోయారు. అందుకే భారతదేశం పాకిస్తాన్‌కు రావడానికి ఇష్టపడలేదు. ఒకవేళ పాకిస్తాన్‌కు వస్తే, వారి పండిట్లు ఇక్కడికి రాలేరని వారికి తెలుసు.." అని మూర్ఖత్వపు మాటలు మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
22 पंडित बाहर से और तीन पंडित रोहित ,हार्दिक और अय्यर टीम में फिर तो पाकिस्तान को हारना ही था 🤣🤣 pic.twitter.com/zaNsq6PUjW
— Raja Babu (@GaurangBhardwa1) February 24, 2025
టోర్నీ నుండి పాక్, బంగ్లా ఔట్
చాంపియన్స్ ట్రోఫీ నుండి ఆతిథ్య పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నీ నుండి నిష్క్రమించాయి. సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా ఓటమి పాకిస్థాన్ చావుకొచ్చింది. 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైన బంగ్లాదేశ్.. పోతూ పోతూ ఆతిథ్య పాకిస్థాన్ ను వెంటపెట్టుకెళ్లింది. గ్రూప్-ఏలో టాప్-2లో నిలిచిన టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ బెర్తులు ఖాయం చేసుకున్నాయి.