
మంచిర్యాల, వెలుగు: అక్రమంగా రవాణా చేస్తున్న 22 క్వింటాళ్ల పీడీఎస్ రైస్‌ను మంచిర్యాల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల ఎన్టీఆర్ నగర్ కాలనీకీ చెందిన వానరాసి ఉమా మహేశ్వర్ ట్రాలీలో అక్రమంగా పీడీఎస్ రైస్ ను తరలిస్తున్నాడు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాకేశ్, తిరుపతి, రాజు సున్నంబట్టి, సూర్యనగర్ ఏరియాల్లో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. దొరికిన రేషన్ బియ్యం విలువ రూ.70 వేలు ఉంటుందని చెప్పారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.