మెరిట్ స్కాలర్​షిప్​కు సెలెక్టయిన స్టూడెంట్స్​

మెరిట్ స్కాలర్​షిప్​కు సెలెక్టయిన స్టూడెంట్స్​

చేగుంట, వెలుగు: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్​ షిప్​కు చేగుంట తెలంగాణ మాడల్​ స్కూల్​కు చెందిన 22 మంది స్టూడెంట్స్​సెలెక్ట్​ అయ్యారని ప్రిన్సిపాల్ భూపాల్ రెడ్డి, ఎన్​ఎంఎంఎస్​ ఇన్​చార్జి పూర్ణయ్య శుక్రవారం తెలిపారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 61మంది ఎంపికవ్వగా, చేగుంట మోడల్ స్కూల్ నుంచే 22 మంది ఎంపికవడం హర్షణీయమన్నారు.

తమ స్కూల్​కు చెందిన హరికిరణ్,  శ్రేణిక్, వైష్ణవి, భరత్ కుమార్, ఆదిత్య, నాగప్రియ, అభినయ, ప్రణీత,  హురేన్, మేఘన, వర్షిత్, రచన,  ప్రణతి, ఇందు,  ఐశ్వర్య, కార్తీక్, వరుణ్ సందేశ్, హారిక, శ్రుతి, అష్మితరాజ్, శ్రీనాథ్, చైతన్య పవార్ సెలెక్ట్​ అయ్యారని చెప్పారు. వీరికి  కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల వరకు ప్రతీ నెలా రూ. 1000 స్కాలర్​షిప్​అందిస్తుందని తెలిపారు.