
- 1990 – 2019 మధ్య ఆర్మీ మట్టుబెట్టిన ఉగ్రవాదుల సంఖ్య
- లోక్‌సభకు తెలిపిన హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: 1990 నుంచి ఈ ఏడాది డిసెంబరు 1 వరకు 22,557 మంది టెర్రరిస్టుల్ని మన ఆర్మీ మట్టుబెట్టిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పాక్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి 2005 నుంచి ఇప్పటి వరకు 1011 మంది ముష్కరులు జవాన్ల చేతిలో హతమయ్యారని చెప్పారు. మంగళవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారాయన.
MORE NEWS:
భారత ముస్లింలు భయపడొద్దు: అమిత్ షా
థియేటర్‌లోకి బయటి ఫుడ్ తీసుకెళ్లొచ్చు: అడ్డుకుంటే ఏం చేయాలి?
జమ్ము కశ్మీర్‌లో శాంతి భద్రతలు కాపాడడం కోసం వేర్పాటువాదులు, కొంతమంది రాజకీయ నేతల్ని నిర్భందంలో ఉంచినట్లు చెప్పారు కిషన్ రెడ్డి. రెగ్యులర్‌గా అక్కడి పరిస్థితిపై సమీక్ష జరుపుతున్నామని, స్థానిక అధికారులు వారిని ఎప్పుడు రిలీజ్ చేయొచ్చంటే అప్పుడు బయటకు వదులుతామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్, లఢక్‌లు కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాక హింసాత్మక ఘటనలు తగ్గాయని చెప్పారు కిషన్ రెడ్డి.
MoS for Home Affairs,G Kishan Reddy in a written reply to a question in Lok Sabha: Since 1990, 22,557 militants have been neutralized in incidents of terrorist violence by security forces till 1st December, 2019. https://t.co/kqVFge8gaL
— ANI (@ANI) December 10, 2019