
మంచు మోహన్ బాబుపై ఖమ్మ జిల్లాకు చెందిన ఓ సామజిక కార్యకర్త పోలీసులుకు కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం మోహన్ బాబు నివసిస్తున్న జల్ పల్లి గెస్ట్ హౌస్ కోసం దివంగత నటి సౌందర్యను హత్య చేయించారని పోలీసులతో పాటు ఖమ్మం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు.
శంషాబాద్‌లోని జల్లేపల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్‌ను అమ్మమని నటి సౌందర్యను మోహన్ బాబు కోరారని, దానికి ఆమె సోదరుడు అమర్‌నాథ్ నిరాకరించారని కార్యకర్త తన లేఖలో పేర్కొన్నారు.
ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఏదైనా దుశ్చర్య జరిగిందో లేదో నిర్ధారించాలని డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు. అలాగే, మోహన్ బాబు తనను 'బెదిరించాడని' ఆరోపిస్తూ, తనకు ప్రాణ రక్షణ కల్పించాలని పోలీసులను అభ్యర్థించాడు. అయితే, సౌందర్య విమాన ప్రమాదంలో మరణించిన 22 సంవత్సరాల తర్వాత, మోహన్ బాబుపై ఫిర్యాదు దాఖలవ్వడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఇకపోతే, సౌందర్య మరియు ఆమె సోదరుడు తెలంగాణకు చెందిన ఒక పార్టీ తరపున ప్రచారం చేయడానికి బెంగళూరు నుండి ప్రయాణిస్తుండగా, హెలికాప్టర్ ప్రమాదంలో (ఏప్రిల్ 17, 2004న) ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ, ఈ సంఘటనపై ఎటువంటి స్పష్టమైన ఆధారాలు వెలువడలేదు.
ALSO READ | Sai Pallavi Dance: సోదరుడి పెళ్లిలో సాయి పల్లవి ట్రెడిషనల్ స్టెప్పులకి ఫ్యాన్స్ ఫిదా.. వీడియోస్ వైరల్