
కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో షార్ట్ సర్వీస్ కమిషన్ 227 పోస్టుల ప్రవేశాల కోసం ఇండియన్ నేవీ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నావల్ ఎయిర్ ఆపరేషన్స్, నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్ తదితర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనుంది.
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
విభాగాలు : జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, పైలట్, లాజిస్టిక్స్, నావల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ బ్రాంచ్.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మే 14 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం www.joinindiannavy.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.