ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని పాకబండ బజార్ లోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ 22వ వార్షికోత్సవం శనివారం స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డీఈవో సోమశేఖర శర్మ, హార్వెస్ట్ విద్యాససంస్థల కరస్పాండెంట్ పి.రవి మారుత్
ప్రిన్సిపల్ ఆర్.పార్వతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు దశాబ్దాలుగా హార్వెస్ట్ విద్యాసంస్థలు ఎంతో మంది స్టూడెంట్స్ ను ఉన్నత విద్యాలయాలకు పంపాయని మంత్రి గుర్తుచేశారు. స్టూడెంట్స్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.