
ఝరాసంఘం, వెలుగు: పిడుగుపాటుతో 23 మేకలు చనిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. ఝరాసంఘం మండలం కుప్పానగర్ కు చెందిన పిచ్చకుంట్ల బాలప్ప తన50 మేకలను తోలుకుని గురువారం అడవికి వెళ్లాడు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షానికి పిడుగు పడడంతో 23 మేకలు మృతి చెందాయి.
దీంతో బాలప్ప బోరున విలపించాడు. సమాచారం అందడంతో తహసీల్దార్ తిరుమలరావు, ఎస్ఐ నరేశ్, ఆర్ఐ రామారావు ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా చేశారు. మేకలను మేపుకుని బతుకుతుండగా రూ. 3 లక్షల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు, గ్రామస్తులు అధికారులను కోరారు.