- బాధితులంతా మహిళా మెడికోలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో వైద్య విద్య కోర్సు చదువుతున్న మెడికోలకు ఫుడ్ పాయిజన్ అయింది. రెండు నెలల క్రితం మెస్ మూతపడింది. వైద్య విద్యార్థుల ఇబ్బందులు పడుతుండడంతో ఈరోజు మెస్ తెరిచారు. ఇందులో భోజనం చేసిన మెడికోలందరికీ వాంతులు, విరేచనాలు కావడం కలకలం రేపింది. డజన్ల సంఖ్యలో మెడికోలు ఒకేసారి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 23 మంది మెడికల్ స్టూడెంట్స్ రిమ్స్‌లో చేరారు. వీరంతా వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో చికిత్స అందిస్తున్నారు.
బాధితులు మరింత పెరిగే అవకాశం..
ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ బాధితులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆస్పత్రి వర్గాలు మెడికోల కోసం మరిన్ని బెడ్స్ సిద్ధం చేస్తుండడంతో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీలో జరిగే క్లాసులకు ఇవాళ మొత్తం 200 మంది మెడికోలు హాజరయ్యారు. 100మంది మహిళా మెడికోల్లో ఇప్పటి వరకు 23మంది మహిళా మెడికోలు అస్వస్థతకు గురయ్యారు. మిగితా వారికి ఎలాంటి లక్షణాలు లేవంటున్నారు డాక్టర్లు. ఫుడ్ పాయిజన్ బాధిత మెడికోలంతా సురక్షితంగానే ఉన్నట్టు రిమ్స్ వర్గాలు ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి