కేటీఆర్ ​వాహనంపై దాడి కేసులోఅదుపులో 23 మంది

కేటీఆర్ ​వాహనంపై దాడి  కేసులోఅదుపులో 23 మంది

భైంసా, వెలుగు: బైంసా లాంటి సున్నిత ప్రాంతంలో రెచ్చగొట్టేలా ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని, గొడవలకు పోవద్దని పూర్తి పటిష్ట పోలీసు బందోబస్తులో శాంతియుతంగా భైంసా ఉందని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల చెప్పారు. 

శుక్రవారం భైంసాలో ఆమె విలేకరులతో మాట్లాడారు. గురువారం సాయంత్రం కేటీఆర్ కార్నర్ మీటింగ్​లో హనుమాన్ భక్తుల ఆందోళన, కేటీఆర్ వాహనంపై దాడి కేసులో 23 మందిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రస్తుతానికి నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా ఉద్రిక్త చర్యలకు దిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు రూమర్స్ నమ్మవద్దన్నారు.