
- గతేడాది కంటే రూ.1,816 కోట్లు ఎక్కువ
- వర్సిటీల అభివృద్ధికి రూ.500 కోట్లు
- బడ్జెట్‌లో రూ.23,108 కోట్ల కేటాయింపులు
- గతేడాది కంటే రూ.1,816 కోట్లు ఎక్కువ
- సెకండరీ ఎడ్యుకేషన్‌కు రూ.19,464 కోట్లు,
- హయ్యర్ ఎడ్యుకేషన్‌కు రూ.3,643 కోట్లు అలాట్
- వర్సిటీల అభివృద్ధికి రూ.500 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా రంగానికి బడ్జెట్‌లో నిధులు పెరిగాయి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో రూ.23,108 కోట్లను ప్రతిపాదించారు. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి రూ.1,816 కోట్లు పెరిగాయి. నిరుడు విద్యా రంగానికి మొత్తం బడ్జెట్‌లో 7.31 శాతం నిధులు కేటాయించగా.. ఈసారి 7.57 శాతానికి పెంచారు. విద్యా శాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్‌లో సెకండరీ ఎడ్యుకేషన్‌కు రూ.19,464 కోట్లు, హయ్యర్ ఎడ్యుకేషన్‌కు రూ.3,643 కోట్లు అలాట్ చేశారు.
స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూ.16,298 కోట్లు నిర్వహణ పద్దు కింద కేటాయించారు. ఇవన్నీ కూడా టీచర్లు, ఉద్యోగుల జీతాలు, అలవెన్స్‌లు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం ఖర్చు చేయనున్నారు. స్కూళ్ల అభివృద్ధి కోసం ప్రగతి పద్దు కింద రూ.3,166 కోట్లు కేటాయించారు. అయితే, గతేడాది రూ.3,001 కోట్లు కేటాయించగా, రూ.3,035 కోట్లు ఖర్చు చేశారు.
సమగ్ర శిక్షకు రూ.1,952 కోట్లు..
ప్రగతి పద్దు కింద తెలంగాణ సమగ్ర శిక్ష స్కీమ్‌కు రూ.1,952.17 కోట్లు ప్రతిపాదించారు. పరీక్షల నిర్వహణకు రూ.7.50 కోట్లు, లైబ్రరీలకు రూ.15.75 కోట్లు, టెక్ట్స్ బుక్ ప్రింటింగ్స్ కోసం రూ.18.25 కోట్లు, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీకి రూ.670.24 కోట్లు కేటాయించారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌కు రూ.10.93 కోట్లు కేటాయించగా, పీఎం పోషణ్‌కు భారీగా నిధులు ఇచ్చారు.
హయ్యర్ ఎడ్యుకేషన్‌కు రూ.453 కోట్లు..
హయ్యర్ ఎడ్యుకేషన్‌కు ప్రగతి పద్దు కింద రూ.453.53 కోట్లు కేటాయించారు. ఇందులో కళాశాల విద్యా శాఖ రూ.110.57 కోట్లు, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌కు రూ.6.47 కోట్లు పెట్టారు. రాష్ట్రీయ ఉచ్ఛతర శిక్ష అభియాన్ (ఆర్‌యూఎస్‌ఏ)కు రూ.55 కోట్లు అలాట్ చేశారు. సర్కారు జూనియర్ కాలేజీల్లో వసతుల కోసం రూ.2.17 కోట్లు ఇచ్చారు. టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు నిర్వహణ పద్దు కింద రూ.518 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.64.11 కోట్లు కేటాయించారు.
నిర్వహణ పద్దు కింద జూనియర్ కాలేజీలకు రూ.738.58 కోట్లు, ఎయిడెడ్ కాలేజీలకు రూ.82.71 కోట్లు, డిగ్రీ కాలేజీల నిర్వహణకు రూ.404 కోట్లను బడ్జెట్‌లో పెట్టారు. కాగా, గతేడాది బడ్జెట్‌లో ప్రగతి పద్దు కింద రూ.617 కోట్లు ఇస్తామని ప్రకటించిగా.. రూ.312 కోట్లు మాత్రమే ఇచ్చారు.
వర్సిటీలకు రూ.500 కోట్లు..
రాష్ట్రంలోని యూనివర్సిటీల అభివృద్ధికి రూ.500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రగతి పద్దు కింద ఉస్మానియా వర్సిటీకి రూ.100 కోట్లు, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి మరో రూ.100 కోట్లు అలాట్ చేసింది. కాకతీయ వర్సిటీకి రూ.50 కోట్లు, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, మహాత్మా గాంధీ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, శాతవాహన వర్సిటీ, పాలమూరు వర్సిటీకి రూ.35 కోట్ల చొప్పున, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి రూ.25 కోట్లు కేటాయించింది.
కొత్తగా ఏర్పాటు చేసిన జేఎన్టీయూ పాలేరు కాలేజీకి ఈ బడ్జెట్‌లో రూ.50 కోట్లు పెట్టారు. మరోపక్క ఉస్మానియా వర్సిటీకి నిర్వహణ పద్దు కింద జీతాలు, ఇతర భత్యాల కోసం రూ.542.68 కోట్లు అలకేట్ చేశారు. కాకతీయ వర్సిటీకి రూ.145.62 కోట్లు, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి రూ20.39 కోట్లు, తెలుగు వర్సిటీకి రూ.47.83 కోట్లు, తెలుగు వర్సిటీకి రూ.46.42 కోట్లు, శాతవాహనకు రూ.15.19 కోట్లు, పాలమూరుకు రూ.12.39 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.
సంవత్సరాలవారీగా విద్యారంగానికి కేటాయింపులు.. (రూ.కోట్లలో)
సంవత్సరం బడ్జెట్ విద్యారంగం శాతాల్లో
- 2020-21 1,82,914 12,144.27 6.69
- 2021-22 2,30,825 15,608 6.78
- 2022-23 2,56,958 16,042 6.24
- 2023-24 2,90,396 19,093 6.57
- 2024-25 2,91,159 21,292 7.31
- 2025-26 3,04,965 23,108 7.57