మిర్యాలగూడ, వెలుగు : పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డుకు చెందిన వ్యాపారి సన్నిధి రమణ ఇంట్లో సుమారు 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం, లక్ష్మి బిన్నీ బాలాజీ రైస్ మిల్లులో సుమారు 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రూరల్ పోలీసులు, టాస్క్ఫోర్స్పోలీసులు సోమవారం రాత్రి పట్టుకున్నారు.
వీరిద్దరూ రేషన్ బియ్యం దందా సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వ్యాపారులు రమణ, నరేందర్ నాయక్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.