ఖమ్మం టౌన్, వెలుగు : శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణమహోత్సవానికి వెళ్లే భక్తుల కోసం నేటి నుంచి ఈనెల18 వరకు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల నుంచి 238 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు రీజియన్ మేనేజర్ సీహెచ్.వెంకన్న తెలిపారు.
జిల్లాలోని ఆర్టీసీ అధికారులు, ఏపీ రోడ్డు రవాణా సంస్థ అధికారులతో సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెషల్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు.