షాకింగ్ : హైదరాబాద్ సిటీలో 24 పెద్ద రెస్టారెంట్లలో చెత్త ఫుడ్ పెడుతున్నారు

 షాకింగ్ : హైదరాబాద్ సిటీలో 24 పెద్ద రెస్టారెంట్లలో చెత్త ఫుడ్ పెడుతున్నారు

హైదరాబాద్ సిటీలో 24 పెద్ద రెస్టారెంట్లలో చెత్త ఫుడ్ పెడుతున్నారని  ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. త్వరలో వాటిపై చర్యలు తీసుకోబోతున్నట్లుగా వెల్లడించారు.  హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారు ఫుడ్ సేఫ్టీ కమిషనర్. ముగ్గురు సభ్యులతో గడిచిన నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించారు అధికారులు. నాణ్యత లేని ఫుడ్ వండివార్చుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.  

పలు ప్రాంతాల్లో రెస్టారెంట్లను తనిఖీ చేసి..  నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని గుర్తించి అందులో ఆహార పదార్థాలను నాచారం ల్యాబ్ కు పంపించారు.  ఇందులో దాదాపుగా 29 శాంపిల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించగా.  ఇందులో 24 పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు అధికారులు.  వాటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.  స్ట్రీట్ ఫుడ్ అమ్మే ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు అధికారులు.  వారికి పరిశుభ్రమైన స్థలంలో, కల్తీ లేని ఆహారం విక్రయించాలని అవగాహన కల్పిస్తున్నారు అధికారులు.