kerala: కేరళలో విరిగిపడ్డ కొండచరియలు..24 మంది మృతి

kerala: కేరళలో   విరిగిపడ్డ కొండచరియలు..24 మంది మృతి


కేరళ వయనాడ్ లో  తీవ్ర విషాదం జరిగింది. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య  24కి చేరింది. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలతో మెప్పాడి  ప్రాంతంలో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. వందలాది ఇండ్లు, వాహనాలు తుడిచిపెట్టుకుపోయాయి. శిథిలాల కింద వందలాది మంది  చిక్కకున్నారు. ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.  స్పాట్ కు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలు, బ్రిడ్జిలు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో వాయు సేనకు చెందని రెండు హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు.వరద బాధితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.

వయానాడ్ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఘటనలో చనిపోయిన వారి ఫ్యామిలీలకు రెండు లక్షల రూపాయల ఎక్స్  గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి 50వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. ఇటు కేరళ సీఎం పినరయి విజయన్ తో ఫోన్ లో మాట్లాడి..ప్రమాద తీవ్రతపై ఆరా తీశారు. కేంద్రం నుంచి సాయం కొనసాగుతుందన్నారు. 

ఇక ప్రమాదంపై స్పందించారు లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ. ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్ తో  ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలని కోరారు. వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైతున్నాయన్నారు సీపీఐ ఎంపీ సందోష్ కుమార్.