కరీంనగర్ టౌన్, వెలుగు: సిటీ వ్యాప్తంగా 24గంటలు తాగునీటిని సరఫరా చేయనున్నామని, అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద స్థానిక హౌజింగ్ బోర్డు కాలనీలో 10 రోజుల్లో సప్లై ప్రారంభించనున్నట్లు మేయర్ సునీల్ రావు వెల్లడించారు. మంగళవారం హౌజింగ్ బోర్డు రిజర్వాయర్ వద్ద కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి మేయర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే 24గంటలు తాగునీటి సరఫరా చేసే సిటీగా కరీంనగర్ నిలువనుందన్నారు.
స్మార్ట్ సిటీ నిధులతో హౌజింగ్ బోర్డు కాలనీ సిటీలోనే మోడ్రన్ కాలనీగా అభివృద్ధి చెందిందన్నారు. అనంతరం 5,27 డివిజన్లలోని శానిటేషన్ పనులను తనిఖీ చేశారు. డ్రైనేజీల్లో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కోల మాలతి, జహారాబాను, గౌషియాబేగం, షరీఫుద్దీన్, పద్మ, లీడర్లు సంపత్ రెడ్డి,-అబ్బాస్ షమి, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.