
అమ్రాబాద్, వెలుగు : మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లే వాహనాలకు నల్లమల అడవిలో 24 గంటలూ అనుమతి ఇస్తున్నట్లు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ డివిజనల్ ఆఫీసర్ రామ్మూర్తి చెప్పారు. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే పర్మిషన్ ఉండగా ఈ నెల 23 నుంచి మార్చి 1 వరకు 24 గంటలు అనుమతిస్తామన్నారు.
అయితే వాహనదారులు 40 కిలోమీటర్ల స్పీడ్‌కు మించకూడదని, హారన్ మోగించడం, ప్లాస్టిక్ వాడకంతో పాటు అడవిలో వాహనాలు ఆపడం, మద్యం సేవించడం, వంట చేసుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. పాదయాత్రగా వచ్చే స్వాములకు ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో మన్ననూర్, వటవర్లపల్లి, దోమలపెంట వద్ద తాగునీటి వసతి, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.